Movies

రెడ్ బస్ యాడ్ లో అల్లు అర్జున్ తో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

ఓ పక్క సినిమాల్లో చేస్తూ విజయాలను నమోదుచేసుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ యాడ్ లో బన్నీతో పాటు నటులు షిండే, ఆలీ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దర్శనమిచ్చారు. ఓ మహారాజు ఫామిలీ ఇతర పోర్టల్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుని నానా పాట్లు పడుతుంటే, రెడ్ బస్ ఉండగా ఇన్నిపాట్లు ఎందుకంటూ బన్నీ ఎంట్రీ ఇస్తాడు. ఇదే కాన్సప్ట్ తో అనేక యాడ్స్ షూట్ చేసారు. ఇక ఈ యాడ్ లో బన్నీ పక్కన ఓ బ్యూటిఫుల్ అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు పారుల్ గులాటి.

రెడ్ బస్ యాత్రలో మహారాజు కుమార్తెగా నటిస్తున్న పారుల్ గులాటి రెండేళ్ల క్రితం నీ జతలేక అనే టాలీవుడ్ మూవీలో యాక్ట్ చేసింది. పంజాబీ అమ్మాయి అయిన ఈమె పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులే. చిన్నప్పటినుంచి ఎగస్ట్రా ఏక్టివిటీస్ గల పారుల్ గులాటి స్టడీస్ లో మిగతావాళ్లు కన్నా ముందుండేది. 17ఏళ్ళ వయస్సులోనే పారుల్ గులాటి ని మోడలింగ్ రంగం వెతుక్కుంటూ వచ్చింది.

ఆమె ఫేస్ బుక్ ఎక్కౌంట్ చూసి, ఆమెకు ఓ యాడ్ ఏజన్సీ వాళ్ళు నేరుగా మోడలింగ్ కాంట్రాక్ట్ అప్పగించారు.ఆ విధంగా మోడలింగ్ రంగంలో దిగిన పారుల్ గులాటి cadbury చాకోలెట్ యాడ్ లో ఆమె నటనతో బురా అనే పంజాబీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. రోమియో రంజా , జురావర్ అనే మూవీస్ లో నటించిన పారుల్ గులాటి 2016లో టాలివుడ్ లో నీ జత లేక మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

నాగసౌర్య తో కల్సి ఆ మూవీలో యాక్ట్ చేసింది. ఇక పంజాబీ మూవీస్ లో నటించే సమయంలో లండన్ డ్రామా స్కూల్ రాడాలో నటనలో మెళుకువలు నేర్చుకుంటూ, యాక్టింగ్ కోర్సు పూర్తిచేసింది. ఇక యాడ్స్ కి ఆమె ఎక్కువ ప్రాధ్యాన్యత ఇవ్వడం వలన చాలా యాడ్స్ లో ఆమె దర్శనమిస్తోంది. సినిమాల్లోనే కాకుండా గర్ల్స్ హాస్టల్ అనే వెబ్ సిరీస్ లో నటించి,వెబ్ సిరీస్ లో కూడా రాణిస్తోంది.