వైకాపా,జనసేనల పొత్తుకు మెగాస్టార్ చొరవ తీసుకుంటున్నారా ?
రాజకీయాల్లో హత్యలు ఉండవు,ఆత్మహత్యలే అని అంటుంటారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కూడా అంటుంటారు. తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో బద్ధ శత్రువులు కాంగ్రెస్ , టిడిపిలు కల్సి పోటీ చేశాయి. ఇది చాలామందిని ఆశ్చర్యంలో పడేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి అధికార టీడీపీని గద్దెదించడానికి వైకాపా అధినేత జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ని మెగాస్టార్ చిరంజీవి కలిసాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్ లో దర్శనమిస్తున్నాయి. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా పోటీకి సై అనడంతో పోటీ రసవత్తరంగా మారబోతోంది. ఇక జగన్ , పవన్ కూడా ఇటీవల వ్యక్తిగత విమర్శలకు దిగారు. మగతనం ఉందా పవన్ అంటే మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే మగతనమా అంటూ జగన్ ధ్వజమెత్తారు.
ఇలా ఈ రెండు పార్టీల అధినేతల నడుమ వార్ నడుస్తోంది. ఇక ఇదే కంటిన్యూ అయితే విడివిడిగా పోటీచేస్తే, మధ్యలో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారన్న మాట జోరుగా వినిపిస్తోంద. ఇక లాభం లేదని భావించిన చిరంజీవి నేరుగా రంగంలో దిగారని అంటున్నారు. ఎందుకంటే జగన్ తో కూడా చిరంజీవికి మంచి సంబంధాలున్నాయి.
వీరిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. కేవలం రెండు మూడురోజుల క్రితమే జగన్ ని చిరంజీవి కలిశాడన్న వార్తలు వస్తున్నాయి . ఈ దశలో వైసిపి,జనసేన కలిస్తేనే చంద్రబాబుని డీ కొట్టడం సులువని చిరంజీవి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటె మాత్రం మళ్ళీ చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని అంటున్నారు. అందుకే జనసేన నేతలు,వైసిపి నేతలు ఇటీవల భేటీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే 45అసెంబ్లీ సీట్లు,8పార్లమెంట్ సీట్లను జనసేన అడుగు తోందని అంటున్నారు . ఇక ఎపి టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకట్రావు ఈ అంశాలను ప్రస్తావిస్తూ, వైకాపా , జనసేన కల్సి పోటీచేయాలని రహస్యంగా భేటీ అవ్వడం నిజం కాదా అని నిలదీస్తున్నారు. ఈమేరకు సీట్లు డిమాండ్ కూడా జరిగిన వ్యవహారం నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. వైకాపా, జనసేనల ను కలపడానికే చిరంజీవి రంగంలో దిగారని అంటున్నారు. ఇక ఈ రెండు పార్టీలు కలిస్తే,కొన్ని జిల్లాల్లో క్లిన్ స్వీప్ ఖాయమని అంటున్నారు. మరి ఏపీలో వీరిద్దరూ ఒకటి అవుతారో లేదా చూడాలి.