Movies

మహర్షి రాఘవ జీవితంలో అసలు నిజాలివే…సినీ రంగంలోకి రావటానికి కారణాలు ఇవే

నటించిన సినిమానే ఇంటిపేరుగా మలుచుకున్న వాళ్లలో నటుడు రాఘవ ఒకడు. దాదాపు 170సినిమాల్లో నటించిన రాఘవ టివి రంగంలో కూడా తనదైన ముద్ర వేసాడు. మహర్షి సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియన్స్ ని ఆకట్టుకున్న రాఘవ ఆతరువాత తన పేరు మొదట అదే సినిమాను చేర్చుకుని మహర్షి రాఘవ అయ్యాడు. వంశీ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించిన ఇతని అసలు పేరు గోగినేని రాఘవ. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన గోగినేని వెంకట చౌదరి,కమల దంపతులకు జన్మించిన రాఘవ తెనాలిలో 10వ తరగతి వరకూ చదువుకుని,గుంటూరులో ఉన్నత విద్య పూర్తిచేశాడు.

స్టడీస్ సమయంలోనే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న రాఘవ గాంధీ జయంతి అనే నాటకంలో గాంధీ పాత్ర పోషించి,మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో చెన్నై చేరిన రాఘవ ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ చాన్నాళ్లు సినీ ఛాన్స్ కోసం ఎదురు చూసాడు. అయినా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. అయినా నిరుత్సాహ పడకుండా ట్రై చేయడంతో 1988లో దర్శకుడు వంశీ తీస్తున్న మహర్షి సినిమాలో లీడ్ రోల్ పోషించాడు.

ఇక ఆ చిత్రంలో హీరోగా చేసిన కేరక్టర్ కి మంచి పేరు రావడమే కాదు,మహర్షి రాఘవగా సినిమాల్లో స్థిరపడ్డాడు. ఇల్లు ఇల్లాలు పిల్లలు,ప్రేమ ఎంత మధురం, హలొ డార్లింగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మహర్షి సినిమా తర్వాత ఆ రేంజ్ లో రాఘవకు సినిమా రాకపోవడంతో సినిమా రంగం నుంచి టివి రంగానికి వెళ్ళాడు.

చిట్టచివరిగా అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీ మూవీలో నటించాడు. అయితే మహర్షి రాఘవ టివి రంగంలో బాగా నిలదొక్కుకున్నాడు. 1998లో టివి రంగంలో బెస్ట్ విలన్ నంది అవార్డు అందుకున్నాడు. సీరియల్స్ లో నటించే శిల్పను వివాహం చేసుకున్నాడు.శిల్ప ఎన్నో సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. శిల్ప,రాఘవ దంపతులకు మౌనిక,రుద్రాక్ష అనే ఇద్దరు పిల్లలున్నారు.