Movies

పవన్ అంటే ఎందుకంత క్రేజ్ !! 10 పాయింట్లలో ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్ అందరు చూడండి

పవన్ కళ్యాణ్ ఓ MLA కాదు… ఓ మాజీ మంత్రి కాదు… ఓ CM కొడుకు కాదు…. కానీ అతని ముందు చేసిన వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతను సృష్టించబోయే ప్రభంజనం గురించి కంగారు పడుతున్నారు. వాస్తవానికి పవన్ ఇప్పుడు ఒక సాధారణ మనిషి. ఒక కామన్ మెన్. జనసేన అనే పార్టీ పెట్టాడు. అయితే ప్రత్యేక రాజకీయాలతో పెద్దగా అనుభవం లేదు. కానీ అయన పిలిస్తే లక్షలాది మంది యువత కదిలి వస్తున్నారు. అయన ఆగిపొమ్మంటే ఆగిపోతున్నారు. అతగాడి పవర్ ఏమిటో, అతగాడికి ఇంత పవర్ ఎలా వచ్చిందో, అతను పవర్ స్టార్ ఎలా అయ్యాడో ఒకసారి చూద్దాం.

1. పవన్ కి ఎందుకంత క్రేజ్ అంటే… పవన్ అభిమానులు కూడా సరిగ్గా చెప్పలేరు. ఇప్పుడు పవన్ కి ఎందుకంత క్రేజ్ ఉందో ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమకు వచ్చిన ఆ తర్వాత తానేమిటో నిరూపించుకున్నాడు.

1996 నుంచి ఇప్పటివరకు 25 సినిమాలు చేసిన పవన్ నటనలోనూ తన సత్తా ఏమిటో చూపించాడు. దాంతో ఆయనకు యూత్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఫ్యాన్స్ అయ్యిపోయారు.

2. తాను అనుకున్నదే చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటాడు పవన్. నిజాయితీగా ఉంటాడు. తప్పు అయినా ఒప్పు అయినా అనుకున్న దానికే నిలబెడతాడు. ప్రజారాజ్యం సమయంలో టిక్కెట్స్ విషయంలో అవినీతి జరిగిందని తెలిసినప్పటి నుండి,చిరు రాజకీయంగా ట్రాక్ మార్చినప్పటి నుండి ఫ్యామిలీకి కూడా దూరం అయ్యాడు.

దాదాపుగా 30 నుంచి 40 ఏళ్ల వరకు అన్న వదిన అంటే దైవంగా బ్రతికిన పవన్ తనకు నచ్చని వ్యవహారాలు కళ్ళ ముందు జరగటంతో నిజాయితీగా బయటకు వచ్చి బ్రతికాడు.

3. పవన్ ఏదైనా విషయాన్నీ ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఈ లక్షణం చాలా మందికి నచ్చదు. అయితే కొంత మందికి ఈ విషయం నచ్చే ఫ్యాన్స్ అయ్యారు. పవన్ బాబుని,మోడీని ఎంత గుడ్డిగా నమ్మాడో, ఇప్పుడు వారి నైజాన్ని తెలుసుకొని అదే స్థాయిలో ఏకి పారేస్తున్నాడు.

4. పవన్ కి ఆవేశం చాలా ఎక్కువ. కోపం ఎంత స్పీడ్ గా వస్తుందో అంతే స్పీడ్ తో తగ్గిపోతుంది. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది.

5. పవన్ కి సహాయం చేసే గుణం చాలా ఎక్కువ. అవసరం ఉందని దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. 2013 లో ఉత్తరాఖండ్ వరదలప్పుడు 20 లక్షలు,వైజాగ్ హుదూద్ తుపాన్ వచ్చినప్పుడు 50 లక్షలు, ఇంకాచెప్పని ఎన్నో సహాయాలు చేసాడు పవన్.

6. 1971 లో పుట్టిన పవన్ కళ్యాణ్ కి 46 సంవత్సరాలు. పవన్ యూత్ కి ఐకాన్. హిట్స్,ప్లాప్స్ పడిన తాను నమ్మిన ఎంటర్ టైన్మెంట్ సిద్ధాంతాన్ని నమ్మి సినిమాలు చేయటం వలన యువత పవన్ కి కనెక్ట్ అయ్యారు.

7. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు. అందుకే వారందరు పవన్ పై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. గతంలో చిరంజీవికి అవకాశం వచ్చిన సద్వినియోగం చేసుకోలేదు.

8. మూడు పెళ్లిళ్లు చూసుకున్నాడనే అంశం పదేపదే తెర మీదకు వచ్చిన హుందాగా స్వీకరించాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అంశం అని చెప్పుతూ, దాని నుంచి ఎప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నం చేయలేదు. విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ కూడా పవన్ మీద ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు.

9. ఎదో పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా పవన్ కి జనాలను దగ్గర చేసింది. కేవలం మాటలతో కాకుండా ఎదో ఒకటి చేయాలనే తపన కన్పించటం కూడా పవన్ కి అభిమానులు పెరగటానికి కారణం అయింది.

10. ఎవరు పుట్టించారో తెలియదు కానీ గాంధీయిజం వలే పవనిజం బాగా పాపులర్ అయింది. ఇవే కాకుండా జనాలను తనవైపు తిప్పుకొనే మేజిక్ ఎదో పవన్ లో ఉంది.