Movies

ఒకప్పుడు స్టార్ హీరో లతో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు గుడి మెట్ల పై ఏమి చేస్తుందో తెలుసా?

సినీ రంగంలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. రంగుల మాయా ప్రపంచంలో ఉన్నత స్థితిలో రాణించేది కొందరైతే,అధః పాతాళానికి చేరేది కొందరు అని చెప్పాలి. ఇక సమాజ సేవలో నిమగ్నమయ్యేవాళ్ళు కొందరున్నారు. మరికొందరు తమ హాబీని నెరవేర్చుకోడానికి ఎలాంటి పనైనా చేస్తారు. ఇలా ఎన్నో వింతలూ విడ్డూరాలు ఉంటాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, తెలుగు ,తమిళ భాషల్లో కన్నా ,కన్నడంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తున్న గ్లామర్ టాలెంటెన్డ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన కృతి కర్బందా తెలుసు కదా. ఈమె తనకోరిక నెరవేర్చాలని గుడిమెట్లు శుభ్రం చేస్తోంది. ఈమె తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కల్సి తీన్ మార్ మూవీలో నటించింది. ఈ ఢిల్లీ భామ కాలేజీ డేస్ లో ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించింది.

ఫెయిర్ అండ్ లవ్లీ, బీమా జ్యుయలర్స్,వంటి కమర్షియల్ యాడ్స్ లో నటించింది. స్పార్క్ యాడ్ లో చూసిన రాజ్ కుప్పాల అనే తెలుగు డైరెక్టర్ తాను తీయబోయే బోణి అనే సినిమాలో హీరో సుమంత్ సరసన హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. పెద్దగా ఈ సినిమా ఆడకపోయినా, తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఛాన్స్ తో మరిన్ని ఛాన్స్ లు రావడానికి దోహదపడింది.

దాని ఫలితమే జయంతి పరాంజీ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కల్సి తీసిన తీన్ మార్ మూవీలో కృతి కర్బందా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో 1970దశకంలో ఓ సంప్రదాయ కుటుంబంలో అమ్మాయి పాత్రలో బాగా రాణించింది. అయినా అనుకున్న పేరు రాలేదు.
ఇక మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య,రామ్ తో ఒంగోలు గిత్త సినిమాల్లో నటించింది. ఎంత చేసినా తెలుగులో ఫలితం రాకపోవడం స్టార్ ఇమేజ్ కి బ్రేక్ రాకపోవడంతో కన్నడ రంగం వైపు దృష్టి సారించింది.

గూగ్లీ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో కన్నడంలో స్టార్ హీరోస్ సరసన చేసింది. అదేసమయంలో తెలుగులో రామ్ చరణ్ హీరోగా చేసిన బ్రూస్ లీ మూవీలో సపోర్టింగ్ రోల్ చేసింది. రామ్ చరణ్ కి అక్కపాత్రలో ఒదిగిపోయింది. అలా మొదలైంది సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన ఈమె తమిళంలో బ్రూస్ లీ మూవీతో హీరోయిన్ అయింది. అయినా పెద్దగా మార్పు లేకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

దీంతో హీరోయిన్ ఛాన్స్ లు రాలేదు. అందుకే కనిపించిన గుడులు , గోపురాలు,గురుద్వారాలు తిరుగుతూ గుడిమెట్లు శుభ్రం చేస్తూ, ప్రసాదాలు పంచుతూ,ఎలాగైనా హీరోయిన్ గా పూర్వ వైభవం రావాలని కోరుకుంటోంది. చూద్దాం ఆమె కోరిక నేరువురుతుందో లేదో!