పైరసీ సినిమా చూసినా /Download చేసినా జైలుకి వెళ్లే అవకాశం ఉందా?
అన్ని వ్యవస్థల్లో అక్రమార్కులు ప్రవేశించి బ్రష్టు పట్టిస్తున్నారు. అందులో భాగంగానే సినీ రంగాన్ని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. అందుకే ఏ కొత్త సినిమా వచ్చినా సరే, రెండు రోజుల్లో ఆ సినిమాకి సంబంధించిన పైరసీ కాపి ఇంటర్నెట్ లో కానీ డీవీడి షాపుల్లో దర్శనమిస్తోంది. ఓ వారం గడిస్తే హై డేఫీనేషన్ ప్రింట్ వచ్చినా రావోచ్చు. ఇలాంటి హెచ్ డి పైరసీ ఎక్కువగా బాలివుడ్, తమిళ సినిమా ఇండస్ట్రీలలో జరుగుతాయి. అంతెందుకు కోట్లు ఖర్చుచేసి తీసిన బాహుబలి – 2 విడుదలైన పదిరోజుల్లోనే పైరసీ హెచ్ డీలో వచ్చేసింది. తెలుగు వెర్షన్ కాకుండా మొదట తమిళం, ఆ తరువాత హిందీ లలో వచ్చేసింది. పైరసీ అనేది ఎంత పెద్ద మాఫియా కావడం వలన ఇండియాలో అతిపెద్ద సినిమా అయిన బాహుబలి కూడా బ్రతికి బట్టకట్టలేదు. సినిమానే ఎందుకు, బాహుబలి టీజర్స్, సన్నివేశాలు, ఏది పడితే అది పైరసీ చేసేసారు.
నిజానికి చూసేవాళ్ళు ఉండబట్టే ఇలా పైరసీ జరుగుతోంది. మనలో ఎంతోమంది పైరసీ సినిమాలు చూస్తారు. పైరసీ చూడటం ఎందుకు అంటే సినిమా టికెట్ రేటు ఎక్కువ అని చెబుతారు. టికెట్ రేటు ఎక్కువ అయినప్పుడు తాపిగా టీవిలో వచ్చినప్పుడు చూడొచ్చు కదా అనే దానైకి సమాధానం ఉండదు. అంత ఓపిక పట్టలేనప్పుడు న్యాయంగా థియేటర్లో చూడాలి. అలా కాకుండా కొన్ని వేలమంది కష్టం, వారి జీవితాలు పట్టనట్లు వ్యవహరిస్తే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. హీరో కోటీశ్వరుడు, తనకేంటి నష్టం అని సింపుల్ గా అనేస్తారు. నిజానికి హీరోకి కాదు, బయ్యర్లకి నష్టం. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేవు. హీరోలు పదేపదే చేసే విజ్ఞప్తి కూడా ఎందుకు పనికిరావడం లేదు. నిర్మాతలు ఇలా మా సినిమా పైరసీ అయ్యిందని చెబితే తప్ప ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకి వేయదు.
ఇక ఆన్ లైన్ లో సినిమాలు చూస్తున్నారు. టొరెంట్స్ నుంచి సినిమాలు, విడియో గేమ్స్, సాఫ్ట్ వేర్స్ .. ఏదిపడితే అది పైరసీ రూపంలో Download చేస్తున్నారు. మరి ఇలా చూస్తున్నందుకు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇండియాలో అలాంటి లా ఏమైనా ఉందా? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. కాపి రైట్ చట్టం 1957 లోని సెక్షన్ 63 – 65 ప్రకారం, అది ఉన్నది ఉన్నట్టుగానే చూస్తే మీరు ఒక పైరసీ ఫైల్ ఇంటర్నెట్ లోంచి Download చేస్తే అది నేరం కిందికి రాదు. ఎందుకంటే ఇది ఇప్పటి చట్టం కాదు, ఇప్పటి పరిస్థితులు ముందే ఊహించి రాయలేదు. కాని అవే సెక్షన్స్ ప్రకారం, మీరు ఆ ఫైల్స్ ని ఇతరులకి పంచితే అది నేరం. అందుకే డీవిడి షాప్స్ లో పైరసీ సీడీలు దొరికితే అరెస్టులు చేస్తారు. అంతేతప్ప జనాల ఇంట్లోకి వచ్చి ఎవరి కంప్యూటర్స్ లో ఏ సినిమాలు ఉన్నాయి అని చూడట్లేదు. ఈ సెక్షన్ల వలనే పైరసీ భూతం ఇలా వ్యాపిస్తోంది.
ఇక పంపిణి చేసినందుకు శిక్షలు వేయలా వద్ద కూడా సాధారణంగా నిర్మాతల చేతిలోనే ఉంటుంది. అయితే వారి సినిమా లింక్ ని డిలీట్ చేయించడం, లేదంటే ఆ సైట్ ని బ్లాక్ చేయించడం, చాలా తక్కువ కేసుల్లో సైట్ ఓనర్స్ ని అరెస్టు చేయించడం జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో శిక్షలు ఆరునెలల నుంచి మూడు సంవత్సరాల జైలు, లేదంటే రూ.5000 జరిమానా .. ఇలా ఉంటాయి. ఇక బ్రౌజర్స్ తీసుకొచ్చిన ప్రైవెసి ఆప్షన్స్ వలన, అసలు ఈ ఫైల్స్ ఎవరు అప్లోడ్ చేస్తున్నారో, ఎవరు డవున్లోడ్ చేస్తున్నారో కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంది. మరి మన ప్రభుత్వాలు ఆ చట్టాల్ని సవరించి సినిమాను ఎలా కాపాడతారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్ని అనుకున్నా ఎండమావి లానే ఉందని అంటున్నారు.