2019 జనవరి 5న సూర్యగ్రహణం ఇండియాలో కనిపిస్తుందా…. నియమాలు పాటించాలా? వంటి సందేహాలకు సమాధానం
2019 వ సంవత్సరంలో జనవరి 5 వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణం జనవరి 5,6,తెధీలలో పాక్షికంగా ఏర్పడుతుంది.ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. భూమికి,సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనిపించకపోవటం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం జనవరి 5,6 తారీఖులలో పాక్షికంగా కనపడుతుంది. అయితే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనపడదని పండితులు చెప్పుతున్నారు.
ఈ సూర్యగ్రహణం కొరియా,చైనా,రష్యా,జపాన్ వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనపడుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయిన మన కాలమానం ప్రకారం జనవరి 6 వతేదీ తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు మొదలై 8 గంటల 34 నిమిషాలకు ముగుస్తుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం సుమారుగా 2 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు.
గ్రహణ పట్టు,విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. సూర్య గ్రహణం మూల నక్షత్రంలో పడుతుంది. అందువల్ల మూల నక్షత్రం వారు,అలాగే ఈ నక్షత్రానికి ముందు నక్షత్రం జేష్ఠా నక్షత్రం వారు,వెనక నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారు, ఉత్తరాషాఢ నక్షత్రం వారు గ్రహణానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయనవసరం లేదు. అయినా సరే గ్రహణం అనేది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట పడుతుంది.
కాబట్టి ఈ నక్షత్రాల వారు సూర్య గ్రహణం రోజు తెల్లవారుజామున లేచి తలస్నానము చేసి గుడికి వెళ్లి ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత భోజనం చేస్తే మంచిది. జనవరి 6 న వచ్చే పాక్షిక సూర్య గ్రహణం భారతదేశంలో కనపడదు కాబట్టి ఎలాంటి భయాలు,నియమాలు పెట్టుకోవలసిన అవసరం లేదు.