ఇంట్లో వంటవానికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్
సాధారణంగా ఎవరైనా ఇళ్లల్లో పనిచేసే పనివాళ్ల ఇళ్లల్లో గానీ,యుక్తవయస్సులో గల పనివాళ్లకు గానీ శుభ కార్యాలు జరుగుతుంటే చేతనైనంత సాయం చేయడం రివాజు. కానీ తెలంగాణా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ నవ దంపతులకు గిఫ్ట్ లు ఇచ్చి,అందరినీ ఔరా అనిపించుకున్నారు. ఇక గిఫ్ట్ లు అందుకున్న ఆ దంపతులు ఆనందంతో కన్నీరు మున్నీరు అయ్యారు. కన్నీళ్లు ఆగలేదంటే దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
అసలు విషయం లోకి వెళ్తే ,కేసీఆర్ ఇంట్లో చాన్నాళ్ల నుంచి కొండేరు సతీష్ అనే వంటవాడు పనిచేస్తున్నాడు. ఇక అతనికి పెళ్లి కుదరడంతో కేసీఆర్ దంపతులు దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు చేయించారు. కేసీఆర్ కూతురు ఎంపీ కవిత దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్ దంపతులు పెళ్ళికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించడంతో పాటు పెళ్ళికూతురికి 10తులాల బంగారం,పెళ్లి కొడుక్కి ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇచ్చారట. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా ఈ పెళ్లి వేడుకకు వచ్చారు.
కేసీఆర్ దంపతులు కళ్ళు చెదిరే గిఫ్ట్స్ ఇవ్వడంతో అక్కడున్న పెళ్ళివారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారట. కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ కి ఏమి కావాలో అన్నీ దగ్గరుండి సతీష్ చూసుకుంటాడట. అందుకే అతడి పెళ్ళికి కేసీఆర్ దంపతులు వచ్చి అదిరిపోయే కానుకలతో సంతృప్తి పరిచారు. దటీజ్ కేసీఆర్ అంటూ చాలామంది అభినందనలు తెల్పారట.