Movies

మహేష్ మహర్షి స్టోరీ లీక్….వైరల్ గా మారిన కథ

ఈరోజుల్లో ఏదైనా ఎక్కడైనా లీక్ అవ్వడం సర్వ సాధారణం అయింది. అది ఇది అని లేదు చివరకు ఎంతో గోప్యంగా నడిచే సినిమా కథలను సైతం లీక్ చేసి పారేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మహర్షి మూవీ కథ లీకయినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. కథ ఇలా ఉందంటూ హల్ చల్ చేస్తోంది. గత ఏడాది వచ్చిన భరత్ అను నేను మూవీ తర్వాత మహేష్ చేస్తున్న మూవీ మహర్షి కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటు పరిశ్రమలో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకూ చాలా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రియల్ లో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఇక కొంత గ్యాప్ ఇవ్వడంతో ఫారిన్ కూడా వెళ్ళొచ్చాడు మహేష్.
Maharshi mahesh babu
వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ సంగీతం హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇక మహర్షి కథ ఇదేనంటూ ఓ వార్త వైరల్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ కథ ఏమిటంటే, మహర్షి పాత్ర పోషిస్తున్న మహేష్ , అల్లరి నరేష్ కాలేజ్ డేస్ లోనే మంచి ఫ్రెండ్స్,వీళ్ళకి హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఫ్రెండ్. ఇక స్టడీ పూర్తయ్యాక మహేష్ నాన్న కంపెనీ వ్యవహారాల కోసం అమెరికా వెళ్ళిపోతాడు.

అల్లరి నరేష్ ఇక్కడే ఉంటాననడంతో మహర్షి కూడా అమెరికాలో తానే ప్రపంచంగా ఉంటాడు.అయితే ఓ రోజు అర్జెంట్ గా రమ్మని ఫోన్ కాల్ వస్తుంది. ఇక అల్లరి నరేష్ ఉండే ఒళ్ళో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది. ఈ సమస్యపై పోరాడే అల్లరి నరేష్ ని పోలీసులు అరెస్ట్ చేసే దాకా వెళ్లడంతో ఫారిన్ నుంచి వచ్చిన మహేష్ తన ఫ్రెండ్ వ్యవహారమే కాకుండా ఊరి సమస్యను కూడా చక్కదిద్దెందుకు రంగంలో దిగుతాడు.

ఈ ప్రయత్నంలో విలన్స్ చేసే అడ్డంకులను అధిగమించి, అల్లరి నరేష్ ని బయటకు తీసుకొస్తాడు. ఇక శ్రీమంతుడు సినిమా పోలికలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.