Movies

పేట స్టోరీ తెలిస్తే రజనీ సూపర్ స్టార్ అనాల్సిందే… రజనీ ఖాతాలో మరో హిట్ ఖాయం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వెరైటీ చిత్రాలకు పెట్టింది పేరు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ కి కొత్త అనుభూతి కలిగించే రజనీకాంత్ 2018లో రోబో 2.0సినిమాతో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ సాధించాడు. ఇక 2019లో అందునా సంక్రాంతి బరిలో పేట మూవీ నిలవబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ కథ వైరల్ అవుతోంది. 1990దశకంలో కథని ఆధారం చేసికుని రూపొందించారట. నిజానికి ఎవరు ఎన్ని కథలు చెప్పినా నచ్చలేదని చెప్పిన రజనీ, ఇక కార్తీక్ సుబ్బరాజు చెప్పిన పేట కథ విన్నాక ఒకే చెప్పాడట.

ముందు పేట మూవీ చేశాకే మిగిలిన స్టోరీల గురించి చూస్తానని రజనీకాంత్ ప్రకటించాడట. ఓ గ్రామానికి పెద్ద దిక్కుగా ఉండే కాళీ పాత్రలో రజనీ ఈ మూవీలో కనిపిస్తాడు. అందరికీ తలలో నాలుకగా ఉంటూ భార్య త్రిషను ఎంతోప్రేమగా చూసుకుంటాడు. ఇక కాళీ తమ్ముడు మల్లిక్(శశికుమార్) రైట్ హ్యాండ్ గా ఉంటాడు. అనుకోకుండా ఆ ఊరికి సిన్గార్ సింగ్ (నవాజుద్దీన్ సిద్ధికి) వలన పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ గొడవల్లో భార్య, తమ్ముడిని కూడా పోగొట్టుకుని రజనీ ఊరొదిలి వెళ్ళిపోతాడు.

అలా ఊరొదిలి వెళ్లిన కాళీ ఓ హాస్టల్ వార్డెన్ గా కాలం వెళ్లదీస్తుంటాడు. అక్కడ విద్యార్థి నాయకుడు మైఖేల్ (బాబీ సిన్హా) చెప్పిందే శాసనంగా అక్కడ నడుస్తుంది. ఇక రజనీని కూడా అక్కడ నుంచి వెళ్లగొట్టేలా మైఖేల్ చేయబోతాడు. ఇక కాళీ మీద పారు (సిమ్రాన్)మనసు పారేసుకుంటుంది. ఓ పక్క లవ్ స్టోరీ నడుస్తుంటే, గ్రామంలో దెబ్బతిన్న జీతూ ( విజయ్ సేతుపతి) అయితే కాళిని చంపడానికి కసిగా తిరుగుతుంటాడు.

కాళీ తమ్ముడు పిల్లలు కూడా అక్కడి కాలేజీలో చదువుతుంటారు. వాళ్లకి ఏ అపకారం జరక్కుండా కాళీ చూస్తుంటాడు. ఇక కాళీ ఆచూకీ జీతుకి,మైఖేల్ కి తెలుస్తుంది. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. విలన్స్ నుంచి ఎలా తనవాళ్లను ఎలా రక్షించుకుంటాడు,విలన్ల భరతం ఎలా పట్టాడు వంటి విషయాలు వెండితెరపై చూడాల్సిందే.