పెళ్లి తర్వాత కలర్స్ స్వాతి ఏమి చేస్తుందో తెలుసా?
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉత్తరాది నుంచి,తమిళ,కన్నడ, మళయాళ భాషల నుంచి వస్తున్న హీరోయిన్స్ కనిపిస్తున్నారు. తెలుగువాళ్లు చాలా అరుదుగానే కనిపిస్తారు. అయితే అలాంటి కొందరిలో కలర్ స్వాతి ని చెప్పుకోవచ్చు. తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా నటించింది. టివిలో యాంకర్ గా చేస్తూ కలర్స్ ప్రోగ్రాం తో కలర్ స్వాతిగా గుర్తింపు పొందిన స్వాతి తన ముద్దు ముద్దు మాటలతో అలరించింది. జనం నుంచి మంచి రెస్పాన్స్ పొందింది. ఇక సినీ రంగంలో కూడా మంచి పేరు కొట్టేసింది. పెళ్లయిన స్వాతి మళ్ళీ సినిమాల్లోకి రాబోతోందట.
నిజానికి డిగ్రీ చదివే రోజుల్లో యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ తో మాటివి ని ఎప్రోచ్ ఐన స్వాతి కలర్స్ అనే టివి షోలో చేసింది. స్వాతి హీరోయిన్ గానే కాదు మంచి సింగర్ కూడా. 100%లవ్ మూవీలో ఓ జోష్ గల పాటను ఆలపించింది. 32ఏళ్ళ స్వాతి మళయాళీ పైలెట్ వికాస్ వాసుని ఈ మధ్యనే పెళ్లి చేసికుంది. అతడు మలేషియన్ ఎయిర్ లైన్స్ లో చేస్తున్నాడు. భర్తను ముద్దుగా కిరీటి అని పిలుచుకుంటుంది. వీళ్ళిద్దరిదీ ఏరేంజ్డ్ మేరేజ్ అయినప్పటికీ ఇద్దరూ క్వాజువల్ గా కలుసుకుని,తొలిచూపులోనే దగ్గరయ్యారు. తర్వాత పెళ్లి మామూలే.
ఇక ప్రస్తుతం ఇండోనేషియాలో స్వాతి దంపతులు ఉంటున్నారు. ఓ ప్రముఖ ఛానల్ ప్రతినిధులు స్వాతి దంపతులను కలిశారు. ఈ సందర్భంగా చాలా విషయాలు చెప్పింది. జుట్టుకి హెన్నా పెట్టడం,డై చేయడం వంటివి ఏదీ ఈమె చేయదట. నెరిసిన జుట్టుతో తన భర్త మాదిరిగానే ఉంటానని, ఇలాగే ఆడియన్స్ కి కూడా కనిపిస్తానని స్వాతి చెబుతోంది. దీనివలన రియాల్టీ తెలుస్తుందని అంటోంది. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.