Movies

అప్పుల పాలై సొంత ఇంటిని కూడా అమ్ముకొని అద్దె ఇళ్లలో బ్రతుకుతున్న టాలీవుడ్ స్టార్స్ వీరే

సినిమా నిజంగా ఓ మాయా ప్రపంచమే. కొందరు కుబేరులుగా ఉంటూ,ఆస్తులను కూడబెట్టుకుంటారు. వారసులకు ఆస్తులు కట్టబెడతారు. మరికొందరు తమ తప్పుల వలన, పరిస్థితుల వలన అప్పుల ఊబిలో కూరుకుపోతారు. సొంత ఇంటిని సైతం అమ్మేసుకునే దుస్థితి వస్తుంది. అలా రోడ్డున పడ్డ వాళ్ళ జాబితా ఎక్కువే. అందులో ప్రధానంగా అలనాటి నటుడు నాగయ్య,మహానటి సావిత్రి మొదలుకుని శ్రీను వైట్ల,కృష్ణ వంశీ వరకూ స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల పరిస్థితి చూస్తే అయ్యో అనిపిస్తుంది.

ఇందులో ముందుగా మహానటి సావిత్రి ని చూస్తే,అప్పటికే పెళ్లయిన జెమిని గణేశన్ ని పెళ్ళిచేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇంటిని , ఆస్తులను పోగొట్టుకుని చివరకు రోడ్డున పడి మరణించింది.

ఇక అప్పట్లో సినీ రంగానికి వచ్చేవారికి ఆపన్న హస్తం అందించే వసతి గృహంగా నాగయ్య ఇల్లు ఉండేది. వచ్చినవాళ్లకు కాఫీలు, టిఫిన్స్ అందించడమే కాదు రోజుకి వందమంది కనీసం ఆ ఇంట్లో భోజనం చేసేవారు. అలా ఓ ధర్మసత్రంలా ఆయన ఇల్లు నడిచింది. దాంతో ఆయన సంపాదన మొత్తం కరిగిపోయింది. కమెడియన్ రాజబాబు ని తీసుకుంటే,అప్పులపాలు కాకపోయినా, చాలామందికి దానధర్మాలు చేసి రోడ్డున పడ్డారు.

ఇక పద్మనాభం ను తీసుకుంటే,అందరితో నాటకాలు వేయించి వచ్చిన డబ్బుని సమాజ సేవకు వినియోగించేవారు. ఒకసారి 60వేల రూపాయలు ఆయనకు అవసరమయ్యాయి. దాంతో ఓ ఫైనాషియర్ దగ్గర ఆరునెలల వ్యవధికి అప్పు తీసుకుని, అంతకుముందు ఆస్తులన్నీ తాకట్టు పెట్టి తీసిన నాలుగు సినిమాల హక్కులను తాకట్టుగా ఫైనాన్షియర్ కి పెట్టాడు. అయితే ఆరు మాసాల్లో అప్పు తీర్చకపోవడంతో ఆ నాలుగు సినిమాలను మూడు లక్షలకు అమ్ముకున్న ఫైనాన్షియర్ కనీసం మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. దాంతో పద్మనాభం ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డాడు

ఐపీఎల్ వలన శిల్పాశెట్టి,సినిమాల వలన సిల్క్ స్మిత ఆస్తులు పోగొట్టుకున్నారు.ఇక వరుసగా ప్లాప్ ల సమయంలో మిస్టర్ సినిమా చేసిన శ్రీను వైట్ల ,ఈ సినిమా బడ్జెట్ ఎక్కువైతే తనది బాధ్యత అని ఒప్పదం పడ్డాడు. తీరా ఆమూవీ బడ్జెట్ పెరిగిపోయింది. ఇంకేముంది అగ్రిమెంట్ ప్రకారం ఆస్తులు అమ్మేసి పెట్టాడు. ఇక సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో నష్టాలపాలై రోడ్డున పడ్డాడు. అలాగే వరుస ప్లాప్ లతో చాలా నష్టపోయాడు.

కాగా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు చివరిరోజుల్లో చాలా అర్దిక ఇబ్బందులు పడ్డారని అందరూ అనేమాట. సినిమా తీస్తున్నాం అంటే, డబ్బులిచ్చిన దాసరి,తీరా ఆసుపత్రిలో ఉన్నప్పుడు డబ్బుకోసం ఫోన్ చేస్తే అవతలి వాళ్ళనుంచి సమాధానం లేదట. ఇక బొగ్గు స్కామ్ వలన కొన్ని ఆస్తులు కేసులో ఉండిపోయాయి. చివరికి ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్మేసుకోవాల్సి వచ్చింది.