Movies

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్ కి చోటు అందుకే ఇవ్వలేదట…నమ్మలేని కారణం చెప్పిన కళ్యాణ్ రామ్

టిడిపి వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి,నటరత్న నందమూరి తారకరామారావు అంటే తెలుగునాట ఓ చరిత్ర. ఇప్పుడు ఈ చరిత్ర సినిమా గా వస్తోంది. ఎన్టీఆర్ తనయుడి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈచిత్రం కథానాయకుడు,మహానాయకుడు అనే రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇందులో తొలిభాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ క్రేయేట్ అయింది. ఎన్టీఆర్ నటజీవితం,రాజకీయ జీవితం రెండింటినీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రెండవ భాగం ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

ఇక వారాహి చలన చిత్ర సమర్పణలో ఎన్ బి కె ఫిలిమ్స్ నిర్మాణంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో అగ్రశ్రేణి నటులు ఎందరో నటించారు. నందమూరి అభిమానులకు ఈ సినిమాతో ముందే సంక్రాంతి పండుగ వస్తుండగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కి కేరక్టర్ లేకపోవడంతో ఒకింత విచారం వ్యక్తంచేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఉంటె ఇంకా హైప్ వచ్చేదని అనుకుంటున్నారు.

దీనిపై బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు. అయితే హరికృష్ణ పాత్ర పోషిస్తున్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చైతన్య రథానికి సారధిగా కనిపించబోతున్నారు. నిడివి కూడా ఎక్కువే ఉంటుంది. రెండవ భాగములో కనిపిస్తాడు. ఈ సినిమా ప్రమోషన్ ఓ భాగంగా ఇంటర్యూలో జూనియర్ ఎన్టీఆర్ కి కేరక్టర్ లేకపోవడంపై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు.

బాలయ్య,తారక్ ల మధ్య అభిప్రాయ బేధాలు లేవు. విభేధాలున్నట్లు పుకార్లు ఎలా వస్తాయో తెలియడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ కి బాబయ్య పిలిస్తేనే తమ్ముడు వచ్చాడు. ఈ సంఘటన చాలదా’అని కళ్యాణ్ రామ్ ప్రశ్నించారు.’తారక్ ఇప్పుడు స్టార్ హీరో. చిన్న పాత్ర వేస్తె అభిమానులు ఇబ్బంది ఫీలవుతారు. తమ్ముడికి తగ్గ పాత్ర లేనందున దర్శకుడు రోల్ ఇవ్వలేదు.

ఇందులో బాబయ్య పాత్ర ఏదీ ఇందులో లేదు. అంతెందుకు తాతయ్య పాత్రను బాబయ్య వేస్తున్నారు. మరి బాబయ్య పాత్ర కూడా ఎదో చిన్న రోల్ గా కనిపిస్తుంది తప్ప పెద్దగా ఉండదు. బాబయ్య పాత్రకే స్కోప్ లేదు. అలాగే తారక్ కి ఛాన్స్ రాలేదు’అని కళ్యాణ్ రామ్ స్పష్టం చేసారు.