Movies

తెలుగు సినీ రంగంలో రియల్ ఎస్టేట్ కింగ్ ఎవరో చూడండి

అన్ని రంగాల్లో ముందు చూపున్న వాళ్ళ మాదిరిగానే సినిమా రంగంలో కొందరు ముందుచూపుతో వ్యవహరించే వాళ్ళున్నారు. లేనివాళ్లకు ఎలాగో లేదు. ఇక అప్పట్లో తక్కువ ధరకు భూములు కొనడంతో అవి ఇప్పుడు వందల రెట్లు పెరిగిపోయి,ఒక్కొక్కరు మిలియనీర్స్ అయ్యారు. మైక్రో సాఫ్ట్ ,గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్ లో నెలకొల్పాక, ప్రపంచ పటంలో తిరుగులేని చోటు సాధించింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం విపరీతంగా పెరగడంతో హైదరాబాద్ చుట్టూ భూములకు గిరాకి ఏర్పడింది. అయితే ఉన్నట్టుండి భూముల ధరలు పెరగడం ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పొలాలు చాలా తక్కువ ధరకు దొరికాయి.

ఆ విధంగా భూముల ధరలు తగ్గడంతో సినీ స్టార్స్ డబ్బులు వెచ్చించి, ఎకరాలకు ఎకరాలు కొనేశారు. దీంతో ఇప్పుడు బిలియనీర్లు అయ్యారు. ఇందులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూర్యాపేట సమీపంలో ఎకారా 6లక్షలు చొప్పున వందెకరాలు కొన్నాడు. ఇక ఇప్పుడు గజం భూమి కూడా కొనడానికి దొరకని పరిస్థితి ఏర్పడిందంటే, అక్కడ ధర ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. నిజానికి రాజమోళి భూమి కొన్న ఏడాదికే దాని ధర నాలుగు రెట్లు పెరిగిందట. ఇక బాహుబలి తర్వాత నల్గొండ జిల్లా ఈదులూరు గ్రామంలో వందెకరాల ఏక బిట్ రాజమౌళి కొన్నాడట. పండ్లు, ఇతర మేలు జాతి మొక్కలను అక్కడ పెంచుతున్నారు. ఇక్కడ ఆధునిక వసతులతో నిర్మించిన గృహంలో రాజమౌళి అమ్మా,నాన్న ఉంటున్నారు. ఇక సినిమాలు ఆపేసాక తన మకాం అక్కడికి మార్చేస్తానని రాజమౌళి చెబుతుంటాడు.

బుల్లితెర యాంకర్ గా విశేష పేరుప్రఖ్యాతులు పొందిన సుమ నెంబర్ వన్ యాంకర్. ఈమె చేసే సినిమా ఈవెంట్స్ కి,టివి షోలకు భారీగానే రెమ్యునరేషన్ అందుతోంది. ఇక ఆమె భర్త సినీ నటుడుగా పలు సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నాడు. హైదరాబాద్ శివార్లలో వ్యవసాయ భూమి కొనాలని ప్రయత్నం చేస్తే , 100ఎకరాల భూమి తక్కువ ధరకు లభించింది. ఇప్పుడు దీనివిలువ ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎకరా కోటి రూపాయలు చూసినా వంద కోట్లకు అధిపతులు కదా.

కాగా హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సొంతంగా పోలో టీమ్ ఉంది. అందుకే హార్స్ రైడింగ్ కి వీలుగా ఉండేలా వికారాబాద్ సమీపంలో 120ఎకరాల లాండ్ కొన్నాడు. రామ్ చరణ్ భూమి కొన్నాక చుట్టూ ఉన్న భూములకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందట. ధర కూడా బాగానే పెరిగిందట.

అయితే డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మహబూబ్ నగర్ లో కొన్ని భూములు కొన్నాడు. అయితే హైదరాబాద్ లో ఉన్నట్టుగా అక్కడ ధర రావడం లేదు.