Devotional

గొబ్బెమ్మలను ఎలా పెట్టి పూజ చేయాలి?

సంక్రాంతి పండుగ మన సంస్కృతి వైభవాన్ని చాటి చెబుతుంది. ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు, డూ డూ బసవన్నలు, ముంగిట గొబ్బెమ్మలు వంటి సాంప్రదాయ వేడుకలు దర్శనం ఇస్తాయి. ఉదయాన్నే గొబ్బెమ్మలను ముగ్గులలో ఉంచి, వాటిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తారు… గొబ్బెమ్మల పూజ అనేది మన తెలుగు సంప్రదాయం. గొబ్బి అనే పదం ‘గోపి’ అనే సంస్కృతపదం నుంచి పుట్టింది. గొబ్బెమ్మకు నమస్కార దేవత, ఇంకా లోకజనని అని కూడా పిలుస్తుంటారు. గొబ్బెమ్మ సాక్షాత్తూ గౌరీ స్వరూపం గా పురాణాలు చెబుతున్నాయి. శక్తిస్వరూపిణియైన కాత్యాయని కూడా గొబ్బెమ్మగా భావిస్తారు.

ఇళ్లముందు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే పిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను వాటిమధ్యలో ఉంచుతారు… ఇలా పెట్టే గొబ్బెమ్మలను కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలుగా పరిగణిస్తారు. రంగురంగుల పూలరేకులు, పసుపు కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మల రూపంలోని గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్యస్త్రీలకు సంకేతంగా చెబుతారు. నాలుగైదు గొబ్బెమ్మల మధ్యలో ఉంచే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం.

సంక్రాంతి రోజులలో సాయంకాలం గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తత్వం తమకూ కలగాలని ప్రార్థించేవారు. ఇలా పాటు పాడడాన్ని సందె గొబ్బెమ్మ అంటారు.గొబ్బెమ్మలని ఆవు పేడతో మాత్రమే చేస్తారు.అవుని గో మాతగా.. కామధేనువు గాను పూజిస్తాము