Movies

విజయమ్మ పాత్రలో నటించిన ఆశ్రిత ఎవరి కూతురో తెలుసా?

అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రెండవసారి వరుసగా ముఖ్యమంత్రిగా ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి రాష్ట్రంలో పాదయాత్ర సాగించిన తీరు అప్పట్లో అందరిని ఆకర్షించింది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ , పాదయాత్ర ఆధారంగానే పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటింపజేసి, అధికారంలోకి వచ్చారు. ఉచిత విద్యుత్ వంటి పథకాలపై ఆయన తొలిసంతకం చేసి అమలు చేసారు. అయితే ఈయన విజయం వెనుక ఆయన భార్య విజయమ్మ ప్రోత్సాహం ఎంతోవుందని చెప్పక తప్పదు. పార్టీ శ్రేణుల్లో కూడా ఆమెకు గౌరవం ఉంది. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మహీ రాఘవ డైరెక్షన్ లో యాత్ర పేరిట మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

వరుసగా బయోపిక్ ల సీజన్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైస్ బయోపిక్ వస్తోంది. వైఎస్ పాత్రను మళయాళ నటుడు ముమ్ముట్టి పోషిస్తున్నారు. అయితే కీలకమైన విజయమ్మ పాత్రను ఎవరు పోషిస్తారా అని అనుకుంటున్న పరిస్థితుల్లో బాహుబలిలో అనుష్క తల్లిగా నటించిన ఆశ్రీత వేముగుంటకు ఆ ఛాన్స్ దక్కింది. బాహుబలిలో కన్నా నిదురించారా సాంగ్ లో అందంగా నాట్యం చేసి,మెప్పించింది.

ఇంతకీ ఈమె 2013లో ఓ ఫంక్షన్ లో నాట్య ప్రదర్శన ఇచ్చినపుడు ఎస్ ఎస్ రాజమౌళి చూసాడు. దీంతో ఆమెలో టాలెంట్ ఉందని గ్రహించి , కొడుకు కార్తికేయ చేత రాజమౌళి ఫోన్ చేయించాడు. కార్తికేయ నుంచి ఫోన్ రావడంతో ఆశ్రీత నమ్మలేకపోయింది. సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా అనగానే ఒకే చేసేసి, బాహుబలితో సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చేసింది.

ఐదేళ్ల వయస్సు నుంచే కూచిపూడి,భరతనాట్యం లలో శిక్షణ పొందడం మొదలు పెట్టింది. ఈమె తల్లి గీత ప్రముఖ వైద్యురాలు. మొదట్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో పనిచేసిన తల్లి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మెడికల్ సైన్సెస్ విభాగానికి డీన్ గా ఉన్నారు. తండ్రి రమేష్ హైదరాబాద్ లో ఓ ప్రముఖ మేనేజ్ మెంట్ కంపెనీలో కన్సల్టెంట్ పనిచేస్తున్నారు.

ఆమె సోదరుడు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇక ఆశ్రీత పెద్దలు చూసిన సంబంధం చేసుకుని నండూరి వారి కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. ఈమె అత్తగారు కూడా నాట్యకళాకారిణి కావడం విశేషం. కాగా అశ్రీతకు ప్రియా కార్తికేయన్ నాట్యంలో తొలిగురువు. రాజేశ్వరి సాయినాధ్ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకుంది.

టీనేజ్ లో యుఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. నిజానికి ఒకదశలో విజయమ్మ పాత్రకు నయనతారను అనుకున్నారట. ఆతరువాత రాధికా ఆప్టే పేరుకూడా నలిగింది. అయితే ఆడిషన్స్ లో మేకప్ వేయగా అచ్చం విజయమ్మల ఉండడంతో అశ్రీతకు ఛాన్స్ దక్కింది. ఫస్ట్ లుక్ విడుదల కావడంతో అచ్చం విజయమ్మ లా ఉందని వైస్సార్ అభిమానులు పొంగిపోతున్నారు.