Movies

ఆ హీరోయిన్ వల్లే నేను ఇలా అయ్యాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రగతి

తమిళనాట హీరోయిన్ గా అడుగుపెట్టి, అందంగా ఉండే అమ్మ పాత్రలకు పెట్టింది పేరుగా తెలుగులో నిలుస్తూ కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి ప్రగతి పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ప్రగతి అమ్మ అంటే ఇలా ఉండాలని చాటిచెప్పింది. సీరియల్స్ లోనూ సత్తా చాటుతోంది. ఈనాటి కుర్ర హీరోలకు తల్లిగా ఈమె చేస్తున్న నటన సూపర్బ్ అని చెప్పాలి. ఈమె 10వ తరగతి చదువుతున్న సమయంలో ఫామిలీలో వచ్చిన సమస్యల కారణంగా చెన్నైలో ఈమె కుటుంబం సెటిల్ అయింది. మొదటి నుంచీ ఎగస్ట్రా ఏక్టివిటీస్ మీద ఆసక్తి గల ప్రగతి మోడలింగ్ లోనూ చేస్తూ కొన్ని యాడ్స్ లో నటించింది.

ప్రగతి ఫోటోలు దర్శకుడు,నటుడు భాగ్యరాజా చేతిలో పడడంతో 1994లో సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది. అదే సినిమా తెలుగులో గౌరమ్మా నీ మొగుడేవరమ్మా టైటిల్ తో విడుదలైంది. అదే ఏడాది ఏకంగా 7సినిమాల్లో నటించినప్పటికీ నటనపై పెద్దగా ఆసక్తి కనబరిచేది కాదు. అందుకే ఆ మర్నాటి సంవత్సరం పెళ్లి చేసుకుని ఇక ఓ బాబు కూడా పుట్టడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

కొన్నాళ్ళు పిల్లలు అంటూ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏదో సాధించాలన్న తపనతో మళ్ళీ నటించాలని నిర్ణయించుకుంది. అయితే ఈలోగా మరో ఇద్దరు పిల్లలు పుట్టేసారు. అయితే హీరోయిన్ గా ఛాన్స్ రాదని తెల్సి,సీరియల్స్ లో ప్రయత్నించి, తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయింది.

లక్కుంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని అంటారు కదా, అలా సురేష్ ప్రొడక్షన్స్ వారి నువ్వులేక నేను లేను మూవీ లో తల్లి పాత్రకోసం ప్రగతికి పిలుపొచ్చింది. అప్పటికే అక్కా చెల్లెళ్ళు సీరియల్ లో నటిస్తున్న ఈమె 30ఏళ్ళు కూడా లేకుండా తల్లి పాత్రలు ఏమిటి అనుకుని, ఇదే విషయాన్నీ సీరియల్ లో తల్లిగా నటిస్తున్న శ్రీవిద్య దగ్గర ప్రస్తావించింది. ‘ఇక నీవు హీరోయిన్ పాత్రలు చేయలేవు. కేరక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగాలి. అలాంటప్పుడు పాత్ర స్వభావం చూడాలే తప్ప ఏ పాత్ర అయితే ఏమిటి, నటన ప్రధానం’అని శ్రీవిద్య విడమరిచి చెప్పడంతో గత్యంతరం లేక తల్లిపాత్రలో నటించింది.

అది హిట్ అవ్వడంతో సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి,అన్ని భాషల్లో కేరక్టర్ రోల్స్ వేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. అల్లు అర్జున్,రామ్ చరణ్,లావణ్య త్రిపాఠి,కాజల్ వంటి యువ స్టార్ హీరో హీరోయిన్స్ కి తల్లి పాత్రలో మెప్పిస్తోంది. యువహీరోలు అమ్మ పాత్రల్లో నటించడం,అవి బ్లాక్ బస్టర్ అవ్వడంతో లక్కీ అమ్మగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఇంతపేరు రావడానికి,ఈ స్థాయిలో ఉండడానికి నటి శ్రీవిద్య కారణమని ప్రగతి ఎంతో గర్వంగా చెబుతోంది.