Movies

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో బామ్మగా నటించిన ఈమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

బుల్లితెర మీద ఇప్పుడు జోరుగా సీరియల్స్ నడుస్తున్నాయి. ఏళ్లకు ఏళ్ళు నడిచే ఈ సీరియల్స్ లో కొన్ని జనరంజకంగా ఉంటె, మరికొన్ని బోరు కొట్టిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. హిందీలో బాలికా వధు సీరియల్ సూపర్ సక్సెస్ కావడంతో మూడేళ్ళ తర్వాత తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. ఈ సీరియల్ లో నటిస్తున్నవారి ప్రతిఒక్కరి పాత్ర కూడా మనసుకి హత్తుకునేలా ఉండడంతో అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఆడవాళ్లను చిత్ర విచిత్రాలుగా హింసించడం చేస్తున్నారు. అలాంటి జాడ్యాలన్నీ పోవాలని ఈ సీరియల్ ని డైరెక్టర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీరియల్ లో ఏ పాత్రకు ఆ పాత్రే పేరుంది. ఇందులో సురేఖ సిక్రి అనే ఆమె బామ్మ పాత్ర వేసి అలరిస్తోంది.

సురేఖ సుక్రి 1942లో ఢిల్లీలో జన్మించిన ఈమె అక్కడే పెరిగింది. ఈమె తండ్రికి బుల్లితెర,వెండితెర సంబంధాలున్నాయి. పెళ్లయ్యాక సినిమాల్లోకి, ఆతర్వాత టీవీ రంగానికి వచ్చింది. 35ఏళ్ళ వయస్సులో కేరక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో చేసింది. తొలిసారి నేషనల్ అవార్డు దక్కించుకున్నాక ఈ బామ్మకు ఛాన్స్ లు వరుసపెట్టి వచ్చాయి. మొదట్లో బాలికా వధుకి ఈమె చెల్లెల్ని అడిగారు.

ఇలాంటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఉన్నవి చేయనని స్పష్టం చేసేసి,తనలాగే గల అక్కని సెలెక్ట్ చేసుకోమని సూచించడంతో సురేఖా సిక్రికి అవకాశం దక్కింది. ఇలా వచ్చిన ఛాన్స్ తో ఈ సీరియల్ లో టాప్ రేంజ్ కి వెళ్ళింది. కంటిన్యూ 7,8ఏళ్ళు సీరియల్స్ లో నటించాక సురేఖ సిక్రికి తీవ్రమైన అనారోగ్యం వచ్చిపడింది. దాంతో ఆమె లేకుండా సీరియల్ నడపలేమని, ఆమె లేకుండా సీరియల్ నడవదని నిశ్చయించుకుని ,కేరక్టర్ ముగించారు. ఇక ఆతర్వాత చాలారోజులు సిక్ అయ్యారు.

ఆమెకు కొడుకు ఉన్నాడు,ఇక చిన్నవయస్సులోనే భర్త చనిపోయాడు. కొడుకుని తానే పెంచి పెద్ద చేసింది. ఊపిరి తిత్తుల ఆనారోగ్యం,తీవ్రమైన బాధతో రక్తం కూడా కలుషితం కావడంతో ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. విదేశాల్లో కూడా చూపించుకుంది. అప్పటికే 70ఏళ్ళు పైబడడంతో డాక్టర్లు కూడా ఆమెను బతికిచడం కష్టమని చెప్పేసారు. అయితే ఆమెలో బతకాలనే మొండి పట్టుదల చావు దాకా వెళ్లి వెనక్కి వచ్చింది.

ఇక ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సొంత కూతురులా కూసుకునే ఇద్దరు పనివాళ్లున్నారు. బడాయి హోం అనే ఓ మీడియా ద్వారా నిరించి ఓ హిందీ ఫిలిం లో ఆమె నటిస్తున్నారు. ఒక ఆధునిక,సంస్కార వంతమైన వాళ్ళు డబ్బులు లేకపోతె ఎలా ఉంటారు, వారి కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తుంది వంటి అంశాలు ఇప్పుడు ఈ మూవీలో కథాంశం. ఈ సినిమాలో కూడా సిక్రి బామ్మ పాత్ర వేస్తోంది.

ఆరోగ్యం దెబ్బతింది,75ఏళ్ళు వచ్చేసాయి రైటర్ అవ్వొచ్చు కదా అని అడిగితే, ‘రిటరైవ్వడం అనేది పనికిమాలిన వాళ్ళు చేసే పని. నాకు అలాంటి కోరిక లేదు బతికున్నంతకం చేస్తూనే ఉంటాను. 104ఏళ్ళ వరకూ నేను నటిస్తూనే ఉండాలి. అంతేకాదు అందరికన్నా పెద్ద నటిగా గుర్తింపు ఉండడమే నా కాంక్ష. చావు అంచనాల వరకూ వెళ్లినా కూడా దీక్షతో అలుపెరుగని రికార్డ్ క్రియేట్ చేస్తోంది.