ఉయ్యాల జంపాల చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు సీరియల్స్ లో టాప్ హీరొయిన్
సినిమా అన్నాక అన్ని రకాల కేరక్టర్లూ ఉంటాయి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ కేరక్టర్ కూడా కీలకం. సినిమా పరిశ్రమలో మొదటినుంచి,చైల్డ్ ఆర్టిస్టులకు డిమాండ్ ఉంది. ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇక ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్నప్పటినుంచి గల ఇంటరెస్ట్ తో చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఇప్పుడు టివి సీరియల్స్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ప్రణవి గురించి తెలుసుకుందాం. ఉయ్యాల జంపాల మూవీలో చిన్నప్పటి ఉమాదేవి పాత్ర పోషించిన ప్రణవి తానూ నేను,మనమంతా వంటి మూవీస్ లో యాక్ట్ చేసి, మంచి పేరు తెచ్చుకుంది.
చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు కొంతవరకే చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తారు. ఎందుకంటే 15,16ఏళ్ళ వయస్సులో టీనేజ్ కారణంగా చైల్డ్ ఆర్టిస్టు ఛాన్స్ లు తగ్గిపోతాయి. అందుకే కొంత గ్యాప్ ఇచ్చి,హీరోయిన్ గానో,సపోర్టింగ్ కేరక్టర్ గానూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. కానీ 8ఏళ్ళ ప్రాయంలో సినిమా రంగంలోకి వచ్చి, ఎన్నో సినిమాల్లో నటించిన ప్రణవి చిన్నప్పటి హీరోయిన్ పాత్రలు, హీరోయిన్ కి చెల్లెలి పాత్రలోనూ నటించింది. అయితే టీనేజ్ వచ్చాక చైల్డ్ ఆర్టిస్టుగా కాకుండా ఇప్పుడు టివి సీరియల్స్ హీరోయిన్ గా నటిస్తోంది.
జెమిని,మాటివి,జిటివి వంటి చానల్స్ లో ఎన్నో సీరియల్స్ లో నటిస్తున్న ప్రణవి ఇప్పుడు ఓ టివి సీరియల్ లో హీరోయిన్ అవతారం ఎత్తింది. ఇప్పటికే సూర్యవంశం, ఉయ్యాల జంపాల వంటి సీరియల్స్ లో నటించిన ఈమె హీరోయిన్ గా నటిస్తున్న సీరియల్ ‘ఎవరి నువ్వు మోహిని’. ఈ సీరియల్ జీటీవీలో ప్రసారం అవుతోంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈమె సినిమాల్లో కూడా హీరోయిన్ గా చూడగలమా అనే చర్చ నడుస్తోంది. అది కూడా సాధ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. .