చిన్నారి పెళ్లికూతురు చైల్డ్ ఆర్టిస్ట్ అవికా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నమ్మలేరు….అవకాశాల కోసం ఏమి చేస్తుందో తెలుసా?
బుల్లితెరమీద చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి, సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న నటి అవికాగౌర్. టివిలో పాపులర్ అయిన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని,ఉయ్యాల జంపాల మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రాజ్ తరుణ్ హీరోగా వేసిన ఆ చిత్రం మంచి హిట్ అయింది. ఇక రాజ్ తరుణ్ తోనే సినిమా చూపిస్తా మావా సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.
అంతకుముందు లక్ష్మీ రావే మా ఇంటికి మూవీలో నాగ సౌర్య పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ మూడు సినిమాల తర్వాత అవికా బాగా లావై పోవడంతో సినిమాల్లో తగ్గింది. దీంతో కొన్నాళ్ళు సినిమాలకు దూరమై స్లిమ్ గా తయ్యారవ్వాలని ప్రయత్నం చేసింది. సినిమాల్లో ఛాన్స్ లు లేకున్నా హిందీ సీరియల్స్ లో బిజీగా ఉంది. అయితే ఆమె ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె పూర్తిగా బక్కచిక్కి వుంది.
ఇక నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా చిత్రానికి లీడ్ రోల్ కాకపోయినా 40లక్షల రెమ్యునరేషన్ ముట్టజెప్పారట ఈమెకి. ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం కేవలం 10రోజులు కాల్ షీట్స్ సర్దుబాటు చేసినందుకు అవికా కు 40లక్షలు ఇవ్వడం విశేషమే. రోజుకి 4లక్షల చొప్పున ముట్టజెప్పినట్లయింది. ఆమె ఇప్పుడు బాగా స్లిమ్ తయ్యారవడంతో బాగా పరిశీలనగా చూస్తే తప్ప ఆమె అవికా అని గుర్తుపట్టడం చాలా కష్టం. ఈ బ్యూటీ రానున్న రోజుల్లో తన హవాను ఏ రేంజ్ లో చూపబోతోందో మరి.
ఇక సహనటుడు మనీష్ రాయ్ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఖండిస్తూ,మా మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అందుకే మేము పెళ్లిచేసుకుంటామని వస్తున్న వార్తలు అవాస్తవం’అని పేర్కొంది.
మనీష్ తో ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనని అవికా పేర్కొంది. అయితే ఆతరవాత తల్లిదండ్రులతో గొడవపడి వేరే ప్లాట్ కి షిఫ్ట్ అయిందట. అయితే అన్ని వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టిందని ఆమె తీరు తేటతెల్లం చేస్తోంది. ఇక బక్కచిక్కిన ఆమె అందంతో కూడిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.