Movies

ఎన్టీఆర్ సినిమాతో విద్యాబాలన్ కి 15 ఏళ్ల శాప విముక్తి… ఎన్ని సినిమాలు మొదలై ఆగిపోయాయో?

ఎంత పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చినా సరే,కొన్ని పాత్రలు చేయాలన్న కోరిక ఉండిపోతుంది. ఒక్కొక్కరికి ఎప్పుడో అప్పుడు అవి నెరవేరతాయి. కొందరికి అసలు అచ్చిరాదు. ఇక ఒక భాషలో నటించేవాళ్ళు ఇంకో భాషలో కూడా రాణించాలని కోరుకుంటారు. అలాంటి కోరిక తీరకపోతే ఇదేం శాపమో అనుకుంటారు. ఇక బాలీవుడ్ లో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించి ఆడియన్స్ మనసు దోచుకోవడం ఆమె స్పెషాలిటీ. బాలీవుడ్ లో టీనేజ్ లోనే హంపన్ఛ్ అనే కామెడీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక స్టడీ పూర్తయ్యాక ప్రదీప్ సర్కార్ డైరెక్టర్ గా యు ఫోరియా, ఫంకాజ్ ఉదాస్ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ఆ మూడు హిట్ అవ్వడంతో ప్రదీప్ సర్కార్ తన డైరెక్షన్ లో పరిణీత అనే మూవీతో బాలీవుడ్ తెరమీద హీరోయిన్ గా ఎంటర్ చేయించాడు. తొలి మూవీతోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకుని పలువురి దృష్టిలో పడింది.

లాగిరాహో మున్నాభాయి,గురు,హే బేబీ,హల్లా బోల్, భూల్ బులియా, కిస్మత్ కలెక్షన్ వంటి మూవీస్ తో బాలీవుడ్ లో హీరోయిన్ గా సుస్థిరస్థానం ఏర్పరచుకుంది. ఇక డర్టీ పిక్చర్,ఇష్కియా,కహాని మూవీస్ కూడా ఆమెను అగ్రశ్రేణి నటిగా బాలీవుడ్ లో నిలబెట్టాయి. ఇక ముంబయికి చెందిన ఈమె తండ్రి తమిళియన్. మళయాళీ. వీళ్ళింట్లో తమిళ్,మళయాళం మిక్స్ చేసుకుని మాట్లాడుకునేవారు. అయితే ఇంతటి గొప్ప నాటికీ సౌత్ ఇండియాలో మొదట్లో చుక్కెదురైందట.

అదెలాగో చూద్దాం. డిగ్రీ పూర్తయ్యాక చక్రం అనే మళయాళ మూవీలో మోహన్ లాల్ పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆమూవీ ఫైనాన్షియల్ ప్రొబ్లెమ్స్ తో ఆగిపోవడంతో విద్యాబాలన్ కి ఐరెన్ లెగ్ అనే మాట వచ్చేసింది. అయితే ఇంకో హీరోయిన్ ని పెట్టుకున్నా ముందుకు నడవక ఆగిపోయింది. తమిళ్ మూవీస్ లో నటించాలని భావించిన విద్యాబాలన్ రన్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తెరవెనుక ఏమైందో ఏమోగానీ మీరాజాస్మిన్ ని ఫిక్స్ చేసారు.

ఇక మనసెల్లామ్ అనే మూవీలో కూడా విద్యాబాలన్ ని ఎంపికచేసి,ఆమె ప్లేస్ లో త్రిషను తీసుకున్నారు. ఇక కలరే విక్రమ్ అనే మళయాళీ సినిమా కంప్లీట్ అయినా ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. ఇలా దక్షిణాదిన ఆమె సైన్ చేసిన 12మూవీస్ ఏదో కారణంతో ఆగిపోవడంతో ఆమెలో నిరాశ అలముకుంది. ఇక లాభం లేదని గ్రహించి బాలీవుడ్ కి అంకితమై, అక్కడ స్టార్ డమ్ తెచ్చుకుంది.

ఇక క్రేజీ హీరోయిన్ అయ్యాక కురిమి అనే మళయాళ మూవీలో నటించింది. తాజగా తెలుగులో ఆమె ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడం ద్వారా 15ఏళ్లుగా దక్షిణాదిన నటించాలన్న కోరిక తీరడమే కాదు తన పాత్రతో అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. ఇక నుంచి సౌత్ ఇండియాలో ఈమె దూసుకెళ్తుందో లేదో చూడాలి.