Movies

వినోద్ కుమార్ ఇద్దరు కొడుకులను, భార్యను చూస్తే ఇక ఫిదా అవ్వాల్సిందే

రామోజీరావు నిర్మించిన మౌన పోరాటం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అలనాటి నటుడు వినోద్ కుమార్ 90వ దశకపు హీరో. ఇక వినోద్ కుమార్ అంటే తెలియని వారుండరు. వందకు పైగా సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగిన వినోద్ కుమార్ తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాడు. మామగారు, సీతారత్నం గారి అబ్బాయి,పోలీస్ బ్రదర్స్,వంటి చిత్రాలతో సూపర్ హీరో అనిపించుకున్నాడు. నిజానికి తవరు మనే మూవీతో కన్నడంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వినోద్ కుమార్ కి 1991లో డాక్టర్ దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన మామగారు మూవీతో ఉత్తమ సహాయనటుడు కింద నంది అవార్డు వచ్చింది.

దక్షిణ కర్ణాటక లోని ఈశ్వర అనే గ్రామంలో పుట్టిన వినోద్ ప్రస్తుతం 55ఏళ్ళ వయస్సులో ముంబయిలో పలు వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు . తన మేనేజర్ మోసం చేయబోయాడన్న కారణంగా ఫ్రెండ్ సాయంతో లారీతో గుద్దించి, దాన్ని ప్రమాదంగా చిత్రించబోయారన్న కేసులో జైలు జీవితం కూడా గడిపి బయటకు వచ్చాడు. ఇప్పటికీ కేసు కోర్టులో నడుస్తోంది. వినోద్ భార్య గృహిణి. మంచి అందంగా ఉంటుంది.

వీరికి ఆయాగ్, అనాగ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఇద్దరు కొడుకులను హీరోలుగా నిలబెట్టడమే తన కర్తవ్యమని ఓ ఇంటర్యూలో వినోద్ కుమార్ చెప్పారు. అందుకే వారికి ఫైట్స్,డాన్స్,యాక్టింగ్ లో అమెరికాలో శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు.
రోషన్ తనేజా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ వంటి స్టార్స్ పిల్లలు మాత్రమే శిక్షణ పొందే సంస్థలో ఆయాగ్, అనాగ్ శిక్షణ పొందుతున్నారు.

తండ్రికి తగ్గ హైట్,తండ్రిని మించిన అందం ఉండడంతో హీరోలుగా వాళ్ళు సరిపోతారు. చిన్ననాటినుంచి తండ్రి నటనను చూస్తూ సినిమా అంటే మక్కువగల ఆయాగ్, అనాగ్ లకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇక వీళ్ళ ఫామిలీ ఫొటోస్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.