Movies

ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రిని తిట్టేసిన అక్కినేని – వెలుగులోకి వచ్చిన మరో నిజం

బయోపిక్ ని సినిమా గా తీయడం అంత ఈజీ కాదు. పాజిటివ్,నెగెటివ్ రెండింటిని టచ్ చేయాలి. లేకుంటే రక్తి కట్టదు. ఇక నందమూరి బాలకృష్ణ స్వయంగా నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా జనవరి 9న విడుదలై సంక్రాంతి బరిలో నిల్చింది. మంచి హిట్ టాక్ కొట్టేసింది. ఇక మొదటి రోజు నుంచి ఎన్టీఆర్ అభిమానులు,నందమూరి ఫాన్స్ ,టిడిపి కార్యకర్తలు అందరూ థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. సినిమా చూసినవాళ్లంతా బాలయ్య అచ్చం అన్నగారిని మరిపించారని అంటున్నారు. బసవతారకం పాత్రలో కూడా విద్యాబాలన్ అద్భుత నటన కనబరిచింది. నిజానికి ఎన్టీఆర్ సినిమా రంగంలో నిలదొక్కుకోడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.

వాటిని ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఎన్టీఆర్,అక్కినేని కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన గుండమ్మ కథ సెన్షేషనల్ హిట్. గుండమ్మ కథలోని ఓ సన్నివేశం చూపించారు.లేచింది నిద్ర లేచింది మహిళా లోకం పాట సీన్ ని ఎన్టీఆర్ కథానాయుకుడిలో చూపించారు. ఎన్టీఆర్ గా బాలయ్య, సావిత్రిగా నిత్యామీనన్ నటించిన ఈ సీన్ లో మొట్టమొదటి సారిగా రెండో టేక్ ని సావిత్రి అడిగినట్లు చూపించారు. అలా అడగడానికి కారణం ఆమె సీన్ లో లీనమవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడమే.

అలా ఆలోచించేది అక్కినేని ఆమెను ఉద్దేశించి అన్నమాటల వలన అని చూపించారు. దాంతో షూటింగ్ సీన్ పై దృష్టి పెట్టలేకపోవడంతో ఎన్టీఆర్ గమనించి, అక్కినేని చెప్పినదాంట్లో తప్పులేదని అంటాడు. సంపాదించిన డబ్బుకి మనమే కాపలాగా ఉండాలని అక్కినేని అనడం నిజానికి మహానటి మూవీలో చూపించలేదు. సావిత్రిలోని మంచితనం చూపించారు. 1963లో అక్కినేని మద్రాసు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంటే,’మీరు ఉండే బంగ్లా ఇల్లు నాకు కావాలి. మీకు కావాల్సినంత ఎమౌంట్ వేసుకుంది’ అంటూ ఖాళీ చెక్కు మీద సంతకం చేసి సావిత్రి ఇవ్వబోతుంది.

అప్పుడు నాగేశ్వరరావు సావిత్రిని మందలిస్తూ చేసిన వ్యాఖ్యలకు సావిత్రి కుదేలవుతోంది. ఇక ఇక్కడ అక్కినేని పాత్రలో సుమంత్ బానే సూటయ్యాడు. అక్కినేని అనేసిన మాటలతో అహం దెబ్బతిని,ఏదో ఆలోచిస్తూ షూటింగ్ లో పరధ్యానంగా ఉండడంతో ఎన్టీఆర్ కూడా అక్కినేని మాటల్లో తప్పులేదని చెబుతూ,మన డబ్బుకి మనమే కాపలాగా ఉండాలని అంటారు. అనవసరంగా దానాలు చేయొద్దని చెబుతారు. నిజానికి సావిత్రి జీవితంలో చేసిన తప్పు అదే.

అక్కినేని ఇంటికోసం షావుకారు జానకి కూడా పోటీ పడింది. అలాంటి ఇంటికోసం బ్లాంక్ చెక్ ఇస్తూ కావాల్సినంత ఎమౌంట్ వేసుకోమంటూ చెప్పడం నిజంగా సావిత్రి అమాయకత్వం అని చెప్పాలి. అప్పటి తమిళ స్టార్ కమెడియన్ చంద్రబాబు కూడా వ్యసనాలకు బానిసై,అడిగినవారికి లేదనకుండా దానం చేసేసారు. ఇక అక్కినేని ఇల్లు కొన్నాక సావిత్రి దగ్గరికి చంద్రబాబు చేరి,మరింత తాగుబోతు అయ్యాడు. అప్పటికే జెమిని గణేశన్ కి సావిత్రి దూరంగా ఉంది. ఇలా ఏది అబద్దమో ఏది నిజమో తెలుసుకోకుండా సావిత్రి పలుసార్లు చిక్కుల్లో పడింది.
NTR – CM of Andhra Pradesh
అందుకే మొదట్లో ఎన్టీఆర్ ,అక్కినేని కొంచెం సుతిమెత్తగా సావిత్రికి చెప్పినా ఫలితం లేకపోవడంతో రానురాను గట్టిగానే చెప్పారు. సంపాదించిందంతా ఇన్కమ్ టాక్స్ రైడ్ లో పోయింది. మరి టిడిపి పెట్టేముందు ఎన్టీఆర్ పై ఐటి దాడి జరిగితే లెక్కలు కరెక్ట్ గా చూపించారు. దటీజ్ ఎన్టీఆర్ . పన్ను ప్రతిదానికి సక్రమంగా కడుతూ దేశభక్తిని ఎన్టీఆర్ చాటారు.