Movies

ఈ హీరో,హీరోయిన్స్ తమ తోటి నటులకు డబ్బింగ్ చెప్పుతారంటే నమ్ముతారా?

గతంలో అందం,అభినయం,వాచకం అన్నీ ఉంటేనే సినిమాల్లో రాణించేవారు. రానురాను మాటలు మరొకరివి ,యాక్షన్ ఇంకొకరిది అన్నట్టుగా మారింది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు ఛాన్స్ లు బాగా వస్తున్నాయి. డబ్బింగ్ అనేది వృత్తిగా మారుతోంది. అరువు గొంతుమీద నటించేవాళ్లకు అవార్డులు ఎందుకని కూడా వాదన మొదలైంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా అవార్డులు దక్కుతున్నాయి. కృష్ణంరాజు,సుమన్ నటించిన బావ మరిది చిత్రాన్ని ఉత్తమ నటుడు అవార్డు వచ్చినపుడు అరువు గొంతుపై ఆధారపడే సుమన్ కి ఎలా అవార్డు ఇస్తారని ప్రశ్న లేవనెత్తారు. దీనిపై గట్టిగానే చర్చ నడిచింది. అయితే గతంలో చాలా చిత్రాల్లో డబ్బింగ్ కూడా ఉంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్, కన్నడ నటుడు రాజ్ కుమార్ లకు జగ్గయ్య, పిజె శర్మ తమ గొంతును అరువు ఇస్తూ, తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

సుమన్ ,రాజశేఖర్ లకు నటుడు సాయికుమార్ డబ్బింగ్ చెప్పి,వాళ్ళ హీరోయిజాన్ని నిలబెట్టారు. అయితే సాయికుమార్ నటుడిగా బిజీ అవ్వడంతో సింగర్ మనో,ఘంటసాల రత్నకుమార్ లతో డబ్బింగ్ చెప్పించుకునేవారు. ఇక గుమ్మడి తన కెరీర్ చివరిలో మాటలు సరిగా లేకపోవడంతో ఆయనకు నూతన్ ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్,శివాజీ గణేశన్,రజనీకాంత్ వంటి వారికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు.

కమల్ హాసన్, రజనీకాంత్ లకు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇప్పటికీ డబ్బింగ్ చెబుతున్నారు. ఇక అరుంధతి వంటి చిత్రాలకు విలన్స్ కి సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ డబ్బింగ్ చెబుతున్నాడు. అరుందతి మూవీలో దెయ్యం పాత్ర పోషించిన సోనూ సూద్ కి డబ్బింగ్ చెప్పి జీవం పోసాడు. తమిళ నటులు సెంథిల్,గౌండ్ర మణి, వడివేలు వంటివారికి కోట శ్రీనివాసరావు,బాబూమోహన్, బ్రహ్మానందం వంటి వారు డబ్బింగ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా మూవీలో ఇలియానాకు కలర్ స్వాతి అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది. ఎందరో హీరోయిన్స్ కి కలర్ స్వాతి డబ్బింగ్ చెప్పింది.

జయం వంటి చిత్రాలకు నితిన్ కి హీరో శివాజీ డబ్బింగ్ చెప్పారు. నత్తి కారణంగా డబ్బింగ్ చెప్పకుండా తప్పించుకుంటున్న నితిన్ లో భయాన్ని పోగొట్టి శ్రీ ఆంజనేయం మూవీ నుంచి డబ్బింగ్ చెప్పుకునేలా డైరెక్టర్ కృష్ణవంశీ చేసి కృషి ఫలించింది . పిజ్జా లో నటించిన విజయ్ సేతుపతి కూడా శివాజీ డబ్బింగ్ చెప్పారు.

చైల్డ్ ఆర్టిస్టు రేంజ్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన రాశి కూడా పలువురికి డబ్బింగ్ చెప్పింది. మిర్చి చిత్రంలో నదియాకు రాశి డబ్బింగ్ చెప్పింది.

సింగర్ చిన్మయి వంటివారు సమంత వంటివారికి డబ్బింగ్ చెప్పారు. పంజాబీ ముద్దుగుమ్మ తెలుగును అతితక్కువ కాలంలో బ్రహ్మాండంగా నేర్చుకున్న ఛార్మి డబ్బింగ్ లో కూడా రాణించింది. కృష్ణవంశీ తీసిన చందమామ మూవీలో కాజల్ అగర్వాల్ కి డబ్బింగ్ చెప్పింది.