కృష్ణ తో ముప్పై సినిమాలు చేసి,శోభన్ బాబుని పరిశ్రమకు పరిచయం చేసిన ఈ డైరెక్టర్ ఒకప్పడు ఏమి చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు
గూఢచారి చిత్రాలకు , జేమ్స్ బ్యాండ్ బ్రాండ్ కి పెట్టింది పేరు డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్. అలాంటి ఇలాంటి డైరెక్టర్ కాదు ఈయన. అందాల నటుడు శోభన్ బాబుని తెలుగుతెరకు పరిచయం చేసింది ఈయనే. కృష్ణతో దాదాపు 30సినిమాలు డైరెక్ట్ చేసాడు. ఎన్టీఆర్ బండరాముడు షూటింగ్ సమయంలో ఫ్లోర్ ని తడిగుడ్డతో తుడిచిన ఓ కుర్రాడు స్టార్ డైరెక్టర్ అవ్వడం నిజంగా యాదృచ్ఛికమే. పైగా ఎన్టీఆర్ నటించిన యుగంధర్ సినిమాకి డైరెక్ట్ చేసే స్థాయికి ఎదగడం మరీ విశేషం. అదీ కె ఎస్ ఆర్ దాస్ గొప్పదనం. అవును బండరాముడు ప్రొడ్యూసర్ కె ఎస్ భావన్నారాయణ సినిమా షూటింగ్ సమయంలో కుర్రవాడిగా ఉన్న దాస్ చేత ఫ్లోర్ అంతా తడిగుడ్డతో తుడిపించాడు . అయితే మళ్ళీ అదే నిర్మాత దాస్ ని డైరెక్టర్ గా చేసాడు.
అందరిలాగే సినిమా కోసం ఇంట్లో చెప్పాపెట్టకున్నా పారిపోయి వచ్చినవాళ్లలో దాస్ ఒకడు. గుంటూరు లోని కృష్ణ మహల్ లో టికెట్స్ అమ్మే పని చేసే దాస్ , టికెట్స్ అమ్మడం పూర్తయ్యాక సినిమాను పదేపదే చూసేవాడు. చదువు అసలు లేదు. అంజలీదేవి నటించిన అనార్కలి సినిమా అనేక సార్లు చూడడమే కాదు, ఊరంతా టికెట్స్ అమ్మి, సినిమా వంద రోజులు ఆడడానికి దోహదపడ్డాడు.
ఇక సినిమా యూనిట్ వంద రోజుల ఫంక్షన్ కోసం గుంటూరు వస్తే, వాళ్ళతో కల్సి ఆఫీస్ బాయ్ ఉద్యోగ్యం కుదుర్చుకుని వాళ్ళతో చెన్నె వెళ్ళిపోయాడు. విజయ ప్రొడక్షన్స్ మేనేజర్ కి దాస్ తండ్రి తెల్సిన వాడు కావడం, వీడికి సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది ఏదో ఒక ఉద్యోగం ఇమ్మని అడగడం వలన నిర్మాత భావనారాయణ దగ్గర పనికి పెట్టాడు ఆ మేనేజర్.
నిత్యం ఉదయం గదులన్నీ తుడవాలి. ఎడిటింగ్ రూమ్ క్లిన్ గా ఉంచాలి. ఇలా రోజూ దాస్ పనిచేస్తూ వచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక దాస్ కి గల శ్రద్ధ చూసిన ప్రొడ్యూసర్ భావనారాయణ ఎడిటింగ్ నేర్పించాడు. అయితే ఒక్కోసారి భావనారాయణ చిరాకుతో ఎంత తిట్టినా భరిస్తూ, ఓర్పుతో పని చేసుకుపోవడం వలన దాస్ కి మంచి భవిష్యత్తు వచ్చింది. నువ్వానేనా, గోపాలుడు భూపాలుడు,ఆకాశరామన్న,భూలోకంలో యమలోకం చిత్రాలకు ఎడిటింగ్ చేసిన దాస్ ని ప్రొడ్యూసర్ భావనారాయణ ఏదో ఎడిటింగ్ పని త్వరగా చేయమని చెప్పారు.
అయితే ఆ పని అప్పటికే పూర్తిచేయడంతో తర్వాత సినిమాకు డైరెక్టర్ నువ్వే అని దాస్ తో ఆ ప్రొడ్యూసర్ అనేసారు. అనుకున్నదే తడవుగా భావనారాయణ చేసేస్తారు. అది ఆయన నైజం. అందుకే ఎడిటర్ దాస్ అరక్షణంలో డైరెక్టర్ అయిపోయాడు. 1968లో డైరెక్టర్ గా ప్రస్థానం మొదలుపెట్టి 2000సంవత్సరం వరకూ శత చిత్రాలకు పైగా పూర్తిచేశారు. కొండ సుబ్బారావు దాస్ అలియాస్ కె ఎస్ ఆర్ దాస్ ని అందరూ ఆప్యాయంగా దాస్ అని పిలిచేవారు. అప్పట్లో కృష్ణతో మోసగాళ్లకు మోసగాడు తీసిన దాస్ సంచలనం సృష్టించారు. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు.
పలు భాషల్లోకి డబ్ అయిన ఈసినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అయింది. చిరంజీవితో బిల్లా రంగా, రోషగాడు,కృష్ణంరాజు, చిరణజీవి తో పులి బెబ్బులి తీసిన దాస్ దాదాపు అందరి హీరోలతో మూవీస్ చేసాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్,అందాల నటుడు శోభన్ బాబు తో మూడేసి సినిమాలు డైరెక్ట్ చేసాడు. ఇక కన్నడంలో విష్ణు వర్ధన్ ని హీరోగా పెట్టి ఏకంగా 14సినిమాలు తీసాడంటే మామూలు విషయం కాదు.1988లో అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకున్న దాస్ ఆతర్వాత కొడుకు పేరిట కంపెనీ పెట్టి మూవీస్ తీశారు.2012జులై 7న మరణించిన దాస్ భౌతికంగా లేకున్నా ఆయన తీసిన చిత్రాలు సజీవంగా ఉంచుతాయి. దాస్ తెలుగు,కన్నడ, హిందీ భాషల్లో 104సినిమాలకు దర్శకత్వం వహించాడు.