ఈ టీవీ నటులు, న్యూస్ యాంకర్స్ ఎలా మరణించారో తెలుసా?
మనకు గతంలో వినోదం అంటే కేవలం సినిమా ఒక్కటే. రాను రాను టివిలు వచ్చాయి. అందులో ప్రోగ్రామ్స్ ,టివి సీరియల్స్ ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. నిజానికి సినిమా మూడు గంటల్లో అయిపోతుంది. షూటింగ్ మాత్రం నాలుగైదు నెలలు పడుతుంది. బాహుబలి లాంటి మూవీస్ రెండు మూడేళ్లు పట్టేస్తాయి. అయితే సీరియల్స్ విషయానికి వస్తే , ఏళ్లకు ఏళ్ళు నడుస్తాయి. కనిష్టం నాలుగేళ్లనుంచి గరిష్టం 12ఏళ్ళు దాటినా దాటిపోతున్నాయి. ఈనేపధ్యంలో నటీనటులుగా వున్నవాళ్లు ప్రేమలో పడడం,ఆ బంధం పెళ్ళికి దారితీయడం జరుగుతోంది. అయితే ఇందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళను పరిశీలిస్తే,ముంబయికి చెందిన అర్పితా తివారి ని చూస్తే,ఈమె శరీరం పై పలు గాయాలున్నట్లు పోస్ట్ మార్టం లో తేల్చారు. గొంతునులిమి ఉపిరాడక మరణించినట్లు పోస్ట్ మార్టం లో తేలినా, అత్యాచారం జరిగినట్లు రుజువుకాలేదు.
ఇక పలు సీరియల్స్ లో నటించిన బుల్లితెర నటుడు ప్రదీప్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యితడు యాంకర్ గా కూడా పనిచేసాడు. ఇతడి వివాహం టివి నటి పావని రెడ్డి తో జరిగింది. పెళ్లయిన నాలుగు మాసాలకే కన్నుమూశాడు. ముందు రోజు బర్త్ డే పార్టీ జరగడం,ఇంట్లో వస్తువులు తెల్లవారుఝామున నాలుగు గంటలకు చిందర వందరగా పడివుండడం, ఓ గాజు గ్లాస్ ని చేతితో పగులగొట్టినట్లు చేతిపై గాయం కూడా వున్నాయి. కోలీవుడ్ పాపులర్ షబానా కూడా ఇలాగే మిస్టరీగా మరణించింది .
ఓ నార్త్ ఇండియన్ ని ఈమె రహస్యంగా పెళ్లాడితే, పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఈమె సూసైడ్ చేసుకుందని పోలీసులు అనుమానించారు. ఈమె బాయ్ ఫ్రెండ్ పంకజ్ యాదవ్ ని పెళ్ళాడి సెటిల్ అవ్వాలని అర్పితా భావించింది. అయితే చివరకు నిర్జీవం అయింది. హంతకులెవరో తేలలేదు. సుమ,ఝాన్సీ వంటి యాంకర్స్ సమయంలోనే ఓ వెలుగు వెలిగిన యాంకర్ మల్లికా స్పాంటేనియస్ గా మాట్లాడడంలో మంచి పేరుతెచ్చుకున్న ఈమె మంచి అందగత్తె కూడా.
జెమిని టివిలో ఎక్కువ కనిపించే 1997నుంచి 2004వరకూ బిజీగా ఉంది. ఎన్నో అవార్డులు అందుకున్న ఈమె కెరీర్ పీక్స్ లో ఉండగానే విజయసాయి అనే వ్యక్తిని పెళ్ళాడి బెంగుళూరులో సెటిల్ అయింది. వీరికి కృష్ణప్రసాద్ అనే కొడుకు ఉన్నాడు. అయితే 39వ యేట ఈమె మరణించింది. రాకుమారుడు,పంచదార చిలక చిత్రాల్లో హీరోయిన్ కి సోదరి పాత్రను పోషించిన ఈమె జెమిని టివి సీరియల్ లో కూడా నటించింది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లి మరణించింది.
కాగా తెలుగులో యాంకర్ గా పేరు తెచ్చుకుంటూ , అష్టా చెమ్మా మూవీలో నటించిన భార్గవి తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ తో కల్సి విషం సేవించి, ఇద్దరూ మరణించారు. నటిగా బిజీ అవుతున్న ఆమెకు అతడితో అప్పటికే పెళ్లయినట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రవీణ్ అలియాస్ బుజ్జికి రెండు పెళ్లిళ్లు అయ్యాయట. ఆర్కెస్ట్రా నిర్వాహకుడైన ప్రవీణ్ నెల్లూరు వాసి. భార్గవి గుంటూరు జిల్లా గోరంట్ల. కాగా రాధికా రెడ్డి విషయానికి వస్తే,భర్త సరిగా ఉండకపోవడం,కుమారుడు మానసిక వైకల్యం కారణంగా తన చావుకి తానె కారణమంటూ సూసైడ్ నోట్ రాసి మరీ మరణించింది.
కొడుకు ఎంతటి మానసిక వికలాంగుడంటే,తల్లి మరణించిందని తెలీక శవం దగ్గర కూర్చుని ఆకలి అంటూ రోదించాడు. అప్పట్లో అందరినీ ఈ ఘటన కలచివేసింది. ఇక ఒంగోలుకు చెందిన టివి 9 యాంకర్ కరీం ని హైదరాబాద్ లో చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. అతడి భార్య శిరీష కు చెందిన కిరణ్,సాంబశివరావు,కృష్ణ కుమారి ఈ దాడికి దిగినట్లు తేల్చారు. యాసిడ్ దాడిలో కరీం కళ్ళు పోయాయి. నేత్తిమీద సుత్తితో కొట్టారు.
అంతకుముందు ఇద్దరిని పెళ్లి చేసుకున్న కరీం, చివరకు శిరీషను ముస్లీమ్ మతంలోకి మార్చడానికి యత్నించడంతో శిరీష పేరెంట్స్ ,సోదరులు ఇలా దాడికి దిగారని అప్పట్లో వార్తలొచ్చాయి. కాగా టివి 5, టివి9యాంకర్ గా న్యూస్ రీడర్ గా , జర్నలిస్టుగా పనిచేస్తున్న బద్రీ ద్వారాకా తిరుమల దగ్గర కారు టైర్ పంక్చర్ అవ్వడంతో వేగంగా చెట్టుని ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భార్య ఇద్దరు పిల్లలు బతికి బయటపడ్డారు.