ఎన్టీఆర్ అక్క సుహాసిని సంచలన నిర్ణయం… షాక్ లో చంద్రబాబు
దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని రాజకీయ రంగం ప్రవేశం చేసి, కూకట్ పల్లి నుంచి బరిలో నిల్చి ఓటమి పాలయిన సంగతి తెల్సిందే. తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,సీపీఐ,టీజె ఎస్ ల తో కూడిన ప్రజాకూటమి లో ఉన్న టిడిపికి 14సీట్లు కేటాయించడంతో కూకట్ పల్లి నుంచి సుహాసిని కి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తక్కువ సమయంలో టికెట్ తీసుకుని,నామినేషన్ వేసిన ఆమె చురుగ్గానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆమె దారుణంగా ఓడిపోయారు.
నిజానికి కూకట్ పల్లినుంచి ఓడిపోతామని చంద్రబాబుకి ముందే తెలుసనీ,అందుకే హరికృష్ణ కుటుంబాన్ని ఆకట్టుకోడానికి టికెట్ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే ఆమెకు ఏపీలో మంత్రి పదవి ఇవ్వవచ్చు కదా అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు ఓ సంచలన ప్రకటన చేసారు. బుధవారం తెనాలి వచ్చిన ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశిస్తే ఎపి రాజకీయాలలోకి వస్తానని ,ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు.
సహజంగానే ఇది సంచలనానికి దారితీసింది. ఎలాగైనా సరే అసెంబ్లీలోకి ప్రవేశించాలని సుహాసిని కోరుకుంటున్నారు. తెలంగాణా లో అయితే పార్టీ దారుణంగా పతనం అవ్వడం వలన ఓటమి వచ్చిందని, ఏపీలో అలాంటి దుర్గతి రాదని అందుకే కృష్ణా జిల్లా నుంచి బరిలో నిలవాలని ఆమె ఆశిస్తున్నారట.ఇక జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు కూడా సుహాసిని ఓటమిపై ఖంగుతిని,విచారంలో ఉన్నారట. అందుకే ఈసారి ఏపీనుంచి పోటీచేస్తే దగ్గరుండి గెలిపించాలని భావిస్తున్నారట.
ఇక సుహాసిని కి తెలంగాణా సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చేస్తున్న కేసీఆర్ ప్రకటనలో అంతరార్ధం ఇదేనని అంటున్నారు. అయితే తాజగా సుహాసిని ఎపి రాజ్యకీయాల్లోకి వస్తానని చేసిన ప్రకటనతో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.