Devotional

రేపు సంపూర్ణ చంద్ర గ్రహణం నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే… మీ రాశి ఉంటే మీరు అదృష్టవంతులు

ఈ నెల 21 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పుష్య మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి తిధి రోజున జనవరి 21 సోమవారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెల 21 న వచ్చే చంద్ర గ్రహణం మన భారత దేశంలో కనిపించటం లేదు. ఈ చంద్ర గ్రహణం సంపూర్ణ చంద్ర గ్రహణం. దీనిని సూపర్ రెడ్ మూన్ అని చెప్పి ప్రపంచం అంతా వీక్షించాలని ఎదురు చూస్తున్నారు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం మన భారత దేశంలో కనిపించటం లేదు. జనవరి 21 న ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏ రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారిపై సంపూర్ణ చంద్ర గ్రహణ ప్రభావం అనుకూలంగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడులు,సమస్యల నుండి బయట పడతారు. కాలం గడిచే కొద్ది వీరికి మంచి జరుగుతుంది. చిన్న చిన్న అనుమానాలు అన్ని నివృత్తి అవుతాయి. అందువల్ల మేష రాశివారు తీపి పదార్ధాలు,ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది. దేవుడికి నైవేధ్యంగా పరమన్నమ్ నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చేస్తే మేష రాశి వారికి ఉన్న దోషాలు అన్ని తొలగిపోతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్నవారికి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా హ్యాపీగా ఉంటారు.

వృషభ రాశి

వృషభ రాశివారికి ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా అనవసర వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వీరు అనవసర విషయాలలో జోక్యం చేసుకోవటం వలన సమస్యల్లో చిక్కుకుంటారు. గ్రహణ స్థితి కారణముగా మీరు ఎదుటి వారికీ మంచి చేయాలనీ అనుకున్న అది అపార్ధానికి దారి తీస్తుంది. వృషభ రాశి వారి మీద ఊహించని అపార్ధాలు,అవమానాలు ఏర్పడతాయి. అందువల్ల ఈ చంద్ర గ్రహణం రోజున వృషభ రాశివారు పంచదార,బియ్యం,పాలు, తెలుపు రంగు పువ్వులను దానం ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వలన వృషభ రాశివారికి వారి మీద వారికీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దేవుడికి తెల్లని పూవులతో పూజ చేసి అటుకులు,పంచదారతో తయారుచేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి.

మిధున రాశి

మిధున రాశివారికి ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం అంత అనుకూలమైన ప్రభావాన్ని ఇవ్వదు. వీరి గ్రహ స్థితి కారణంగా మిధున రాశివారు వ్యక్తిగత సమస్యల్లో పడతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరు ప్రయాణాలు కూడా చేయటం మంచిది కాదు. మిధున రాశివారు ఆకుపచ్చని కూరగాయలు,ఆకుపచ్చని వస్త్రాలను దానం ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే మీకు ఉన్న సమస్యలు తీరతాయి. అలాగే చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు ఈ దానాలను చేస్తే చదువు పట్ల శ్రద్ద పెరుగుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశివారిపై ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ముఖ్యమైన మార్పును తెస్తుంది. జీవితంలో ముఖ్యమైన మార్పును చూడబోతున్నారు కర్కటక రాశివారు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం కర్కాటక రాశిలోనే ఏర్పడుతుంది. అందువల్ల గ్రహణ ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువగానే ఉంటుంది. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఊహించని పెద్ద మార్పుకు దారి తీస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో వృద్ధి కలిగి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనీ ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తుంది. కర్కాటక రాశివారు బియ్యం,వెండితో చేసిన చిన్న చిన్న వస్తువులను,పాల వస్తువులను దానం చేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయి.

సింహ రాశి

సింహరాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో వీరి స్థాయి పెరుగుతుంది. వీరు చేసే పనిలో ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఎదో కొత్తగా చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. చేసే పనిలో వంద శాతం శక్తి సామర్ధ్యాలను పెడతారు. సింహ రాశివారు వారి గ్రహ స్థితి కారణంగా చంద్ర గ్రహణం రోజున ఎర్రటి వస్త్రాలు,సిందూరం, కొవ్వొత్తి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు,మంచి గుర్తింపు లభిస్తుంది.

కన్యా రాశి

కన్యా రాశివారు ఈ గ్రహ స్థితి కారణంగా ముఖ్యమైన రహస్యాల విషయంలో కాస్త ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందువల్ల కన్యా రాశివారు మాట్లాడే సమయంలో కాస్త ఆచి తూచి మాట్లాడటం మంచిది. ఈ రాశివారు వ్యక్తిగత విషయాలను,రహస్యాలను ఎవరికి చెప్పకుండా ఉండటమే మంచిది. ఒకవేళ ఈ విషయాలను ఎవరికైనా చెప్పితే కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే అవుతుంది. అందువల్ల వ్యవహారాలు చేసేటప్పుడు వ్యకిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త వహించాలి. కన్యా రాశివారు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు గ్రహస్థితి కారణంగా గ్రహణం రోజు కూరగాయలు,పుస్తకాలు,రాగి వస్తువులను దానంగా ఇవ్వాలి.

తుల రాశి

తుల రాశివారికి ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటివరకు ఉన్న గొడవలు అన్ని తొలగిపోతాయి. అంతేకాక కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆర్ధికంగా బలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారు వారికి ఎదురయ్యె వివాదాలను,సమస్యలను చాలా సామరస్యంగా పరిష్కరించుకుంటారు. తుల రాశికి చెందినవారు బియ్యం,పంచదార,గంధం చెక్కను దానంగా ఇవ్వాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారు గ్రహస్థితి కారణంగా శుభవార్త వింటారు. ఇప్పటి నుంచి అనుకూలమైన సమయం ప్రారంభం అయినట్టే. వృశ్చిక రాశివారు ఇప్పటివరకు ఉన్న సమస్యల నుండి బయట పడతారు. ప్రతి సమస్య నుండి చాలా తొందరగా బయట పడతారు. వీరు గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ సహనంతో ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశివారు క్రమశిక్షణతో ఉంటారు. వీరు భవిష్యత్ గురించిన ఆర్ధిక వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. వీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వృశ్చిక రాశివారు గ్రహస్తితి కారణంగా ఎరుపు రంగు పువ్వులు,ఉలెన్ వస్త్రాలను దానం చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబందం పెరుగుతుంది.

దనస్సు రాశి

దనస్సు రాశివారు వృత్తిపరమైన విషయాలలో విజయాలను సాధిస్తారు. వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాదిస్తారు. ఆర్ధికపరంగా మంచి స్థితిలో ఉంటారు. ఆర్ధికపరమైన అంశాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. దనస్సు రాశికి చెందిన విధ్యార్ధులకు మంచి అనుకూలమైన కాలం అని చెప్పాలి. వీరు పోటీ పరీక్షలో బాగా రాణిస్తారు. కుటుంబ పరంగా ఎంతో సంతోషంగా ఉంటారు. దనస్సు రాశివారు వారి గ్రహస్థితి కారణంగా చంద్ర గ్రహణం రోజు శనగపప్పు,పసుపు,వంట సామగ్రిని దానం చేయాలి.

మకర రాశి

మకర రాశివారు ఈ గ్రహస్థితి కారణంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభనస్టాలు సమానంగా ఉంటాయి. ఆర్ధికంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే మాత్రం కోలుకోలేని ధనం కోల్పోవలసి వస్తుంది. ఆర్ధిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ధనాన్ని బాగా సంపాదిస్తారు. మీరు ఏ మాత్రం మొహమాటం పడినా, ఏ విషయాన్ని అయిన చెప్పటానికి సంకోచించిన ఆ ప్రభావం ఆర్ధిక స్థితిపై పడుతుంది. మెంటల్ టెక్షన్స్ లేకుండాచూసుకోవాలి . వీరిలో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. మకర రాశివారు ఈ గ్రహస్థితి కారణంగా చంద్ర గ్రహణం రోజున నూనె,నల్లటి వస్తువులు,ఐరన్,మినుములు దానం చేయాలి.

కుంభ రాశి

కుంభ రాశివారు ఈ గ్రహస్థితి కారణంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీ ఎదుట ఒకరకంగా మాట్లాడి ఎదుటి వారి దగ్గర మరోరకంగా మాట్లాడుతారు. ఇటువంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి విషయాలను ఎవరి దగ్గర చెప్పకూడదు. మీ శత్రువులపై విజయాన్ని సాధించాలంటే మౌనంగా ఉండాలి. కుంభ రాశివారు వారి గ్రహస్థితి కారణంగా చంద్ర గ్రహణం రోజున ఆహార ధాన్యాలు,బియ్యం,పువ్వులు,మిశ్రమ రంగులు కలిగిన దుస్తులను దానం ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వలన సమస్యలు అన్ని తొలగిపోతాయి.

మీన రాశి

మీనా రాశికి చెందిన వారు ఎవరికి చెప్పుకోలేని,ఎవరికీ తెలియని సమస్యల నుండి బయట పడతారు. ఈ సమస్యలను పరిష్కారం చేయటానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న ఈ గ్రహణం నుండి ఆ సమస్యల నుండి బయట పడతారు. మీనా రాశికి చెందినవారు గ్రహస్థితి కారణంగా ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఊహించని ధనం వస్తుంది. మీనా రాశికి చెందిన విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ అనుకూలత ఉంటుంది. మీనా రాశికి చెందిన వారు పసుపు రంగు పువ్వులు,పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయటం వలన అనుకూలమైన ఫలితాలు వస్తాయి.