రిపబ్లిక్ డే సందర్భంగా బ్రేవరీ అవార్డు ఎవరికీ,ఎందుకు ఇస్తారు?
ప్రతి సంవత్సరం జనవరి 26 న రిపబ్లిక్ డే ని జరుపుకుంటాం. భారత ప్రధాని త్రివర్ణ పతాకం ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించడం, వేడుకలు అన్ని అయ్యాక బ్రేవరీ అవార్డు ని ప్రదానం చేస్తారు. అసలు బ్రేవరీ అవార్డు ని ఎవరికీ ఇస్తారో తెలుసుకుందాం. భారతదేశంలో, స్వచ్ఛందంగా యువతీ యువకులూ, బాలబాలికలూ, తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి, ప్రకృతి బీభత్సాల, ప్రమాద భూయిష్టమైన సంఘటనల సందర్భాలలో, పౌరులని పరిరక్షించిన వుదంతాలెన్నెన్నో ఏటేటా జరుగుతూనే వుంటాయి. అలాంటి సాహసోపేతమైన యువతని సత్కరించడానికి, భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నేషనల్ బ్రేవరీ అవార్డ్స్’ ప్రదానం చేసే సత్సంప్రదాయం, ఏటేటా, రిపబ్లిక్ డే నాడు కొనసాగుతూనే వుంటుంది.