F2 సినిమాలో ప్రకాష్ రాజ్ వైఫ్ గా వేసింది ఒకనాటి టాలీవుడ్ హీరొయిన్… హీరోయిన్ గా ఏ సినిమాలు?
సినిమాల్లో రకరకాల ట్రెండ్ నడుస్తుంది. అందులో ప్రధానంగా హీరో హీరోయిన్స్,విలన్స్ లో ఎన్నో స్టైల్స్ కనిపిస్తున్నాయి. కానీ తల్లి , వదిన పాత్రల్లో కూడా మార్పులొచ్చాయి. ఒకప్పుడు అయితే తల్లి పాత్రల్లో పండరి బాయ్,అంజలీ దేవి,వరలక్ష్మి తర్వాత తరంలో అన్నపూర్ణ తదితరులు కనిపించేవారు. కానీ ఇప్పుడు మారిన ట్రెండ్ ప్రకారం అమ్మ, వదిన పాత్రల్లో వేసేవాళ్ళు కూడా అందంగా కనిపించాలి మరి. అందుకే జయసుధ, నదియా,రమ్యకృష్ణ, స్నేహ,ఇలా డిఫరెంట్ గా అమ్మ,అత్తా,వదిన తదితర పాత్రల్లో ఒదిగిపోతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. దీంతో ఈ పాత్రలకు కూడా యమ గిరాకీ ఏర్పడింది.
తాజాగా ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2మూవీలో విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ తమ నటనతో అదరగొట్టారు. ఈసినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ప్రకాష్ రాజ్ భార్య పాత్ర పోషించిన నటి కూడా ఆడియన్స్ దృష్టిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆమె పేరు రాజశ్రీ నాయర్. ఈమె ఎవరంటే ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ గా రాణించింది.
మళయాళం, హిందీ సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. అంతేకాదు తెలుగులో హైదరాబాద్ బ్లూస్ అనే మూవీలో కూడా నటించింది.
నిజానికి రాజశ్రీ నాయర్ ని హీరోయిన్ గా కంటే సపోర్టింగ్ కేరక్టర్స్ అయిన తల్లి,వదిన,సిస్టర్ పాత్రల్లోనే ఎక్కువగా మన తెలుగు డైరెక్టర్స్ చూస్తున్నారు. తమిళం,మళయాళం లలో శబరి,మేఘసందేశం,తూరి మేరీ గంగ, తదితర మూవీస్ లో హీరోయిన్ గా చేసింది.
అప్పట్లో ఆమె నటించిన తమిళ మూవీస్ హీరోయిన్ గా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చిన్న వయసులోనే తల్లి,వదిన పాత్రలతో తెలుగులో నేను శైలజ, పేపర్ బాయ్,ఎఫ్ 2వంటి సినిమాల్లో కనిపించింది. తెలుగులో ఆర్కే మీడియా నిర్వహణలో ఈటీవీలో వస్తున్న స్వర్ణ ఖడ్గం అనే సీరియల్ లో రాజమాత పాత్రలో నటిస్తున్న ఈమె తెలుగులో సపోర్టింగ్ పాత్రలతో దూసుకెళ్తోంది.