రిపబ్లిక్ డే గురించి కొన్ని నిజాలు
స్వాతంత్య్రం అంటే ఏమిటో ,రిపబ్లిక్ డే అంటే ఏమిటో, అసలు ఈ రెండింటికీ తేడా ఏమిటో కూడా చాలామందికి తెలీదు. అసలు వీటిని ఎందుకు జరుపుకోవాలో కూడా తెలీకుండా జరిపిస్తారు చాలామంది. నూటికి 65శాతం మందికి గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో తెలీదట. ఇది ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలిందట. పోనీ నిరక్షరాస్య్లు అలా అంటున్నారా అంటే అదీ కాదు. చదువుకున్న వాళ్ళకే రిపబ్లిక్ డే అంటే ఏమిటో తెలియకపోవడం మరీ విడ్డూరం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో కూడా చాలామందికి తెలీదు.
దేశంలో ప్రతిఒక్కరు 1950జనవరి 26ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 200ఏళ్ళు బ్రిటిషు వారి పాలనలో మగ్గిన భారతీయులకు 1947ఆగస్టు 15న స్వాతంత్య్రం ప్రకటించారు. అప్పటిదాకా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగింది. అయితే స్వాతంత్య్రం రావడంతో మనకు నచ్చినట్టు మనం పరిపాలన సాగించడానికి ఒక రాజ్యాంగం అవసరమని గుర్తించారు. దాంతో 1947ఆగస్టు 29న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరం 1949నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. 2సంవత్సరాల 11నెలల 18రోజుల కాలంలో పూర్తిచేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పాలి.
ప్రజల చేత, ప్రజల కొరకు,ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రతినిధులతో పరిపాలన సాగించడానికి ప్రజాస్వామ్యం ఎంతో దోహదమవుతుందని అబ్రహం లింకన్ చెప్పాడు. ఇక ప్రజాస్వామ్యానికి మూలం మన రాజ్యాంగం. అలా ఏర్పడ్డ రాజ్యాంగం 1950జనవరి 26న ఉదయం 10 గంటల 18నిమిషాలనుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ప్రతులు ఇంగ్లీషులో ఒకటి,హిందీలో ఒకటి ఉన్నాయి. ఇవి పాడవకుండా ఉండడానికి హీలియం వాయువు నింపిన బ్రీఫ్ కేసులలో ఉంచి,పార్లమెంట్ లో భద్రపరిచారు. వాటి నకలు, ఫోటో కాపీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆరోజు నుంచి పూర్తిగా గణతంత్ర దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. ప్రజలే ప్రభుత్వం,ప్రభుత్వమే ప్రజలు అని అర్ధం వచ్చేలా….