డిప్రెషన్ తో బాధ పడుతున్నారా? డిప్రెషన్ నుండి ఎలా బయట పడాలి?
డిప్రెషన్ ఉందని గుర్తించాక నివారణ చర్యలను చేపట్టండి. మీకు మీరుగా కొన్ని పద్దతులు పాటించటం ద్వారా చాలా వరకు డిప్రెషన్ నుండి బయట పడవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
నవ్వు
నవ్వు నలబై విధాల మేలు చేస్తుందని అంటారు నిపుణులు. మీ డిప్రెషన్ నుంచి బయట పడే పద్దతులను నవ్వుతోనే ప్రారంభించండి. మీరు బాగా డిప్రెషన్ గా ఉన్నానని గుర్తించినప్పుడు హాయిగా నవ్వటానికి ప్రయత్నించండి. మీ
స్నేహితులతో కలిసి జోక్స్ చెప్పుకోండి. లేదా టీవిలో కామెడీ కార్యక్రమాలను చూడండి.
పనులను వేగవంతం చేయండి
సాదారణంగా డిప్రెషన్ కి గురి అయినప్పుడు ఏ పని చేయాలని అనిపించదు. అలా ఖాళీగా కూర్చుంటే డిప్రెషన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రోజు వారి పనులను పూర్తి చేయండి. అలాగే వాయిదా వేసిన పనులు ఉంటే వాటిని కూడా పూర్తి చేయండి. పనిలో పడితే మీ ఆలోచనల్లోనూ, మీ మూడ్ లోను మార్పు వచ్చే అవకాశం ఉంది.
ప్రకృతి ఒడి లోకి
పచ్చదనం కంటికే కాదు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బాగా డిప్రేస్ లో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న పార్క్ లేదా పచ్చని ప్రదేశాలకు వెళ్ళండి. ఏకాంతంగా వెళ్ళితే ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
బిజీ షెడ్యుల్
డిప్రెషన్ కి గురి అయినప్పుడు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం అమలు చేయాలి.
ఆధ్యాత్మకత
ఆధ్యాత్మకత కొంతవరకు మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. తరచూ దేవాలయాలకు వెళ్ళటం,పురాణ గ్రంధాలను చదవటం వంటివి చేస్తే కొంతవరకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
అయితే ఇవి కేవలం డిప్రెషన్ దూరం చేసుకోవటానికి ఒక మార్గంగా పనిచేస్తాయి కానీ చికిత్సగా మాత్రం పనిచేయవని నిపుణులు చెప్పుతున్నారు.