Movies

శివ శంకర్ మాస్టర్ కి చుక్కలు చూపించిన కోడలు… నిజం ఎంత ఉందో చూడండి

కొందరు వృత్తిపరంగా ఎంత ఎదిగినా ఇంటిలో మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడతారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లతో నెట్టుకొస్తారు. అలాంటి వాళ్లలో ఒకప్పటి టాప్ నృత్య దర్శకుడు శివశంకర్ ఒకరు. సినిమా కొరియోగ్రాఫర్ గా ఎందరి హీరోల ఉన్నతికో ఊతమిచ్చిన శివశంకర్ నిజజీవితంలో మాత్రం దారుణంగా దెబ్బతిన్నారు. ముఖ్యంగా కోడలి వలన నరకం చూసిన శివశంకర్ ఒకదశలో అప్పటి సీఎం జయలలితకు లేఖ కూడా రాసారు. వివరాల్లోకి వెళ్తే, కొరియోగ్రాఫర్ గా ఎన్నో చిత్రాలకు పనిచేసిన ఈయన మెగాస్టార్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఖైదీ మూవీకి సమకూర్చిన నృత్య రీతులు సూపర్భ్. అప్పట్లో ఖైదీ సాంగ్స్, వాటి స్టెప్స్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఖైదీ మూవీలో రగులుతోంది మొగలిపొద సాంగ్ సూపర్ డూపర్ హిట్ గా నిల్చింది. క్లాసికల్ డాన్స్ లేకాదు మాస్ స్టెప్పులు వేయించగల నేర్పరి. నిజానికి కొందరు నటులు ఎలాంటి డాన్స్ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి వస్తారు. మరి అలాంటి వారితో స్టెప్పులు వేయించడంలో ఈయన దిట్టగా పేరుపొందారు. అలాంటి వారికోసమే కూచిపూడి,భరతనాట్యం కలగలిపి స్పెషల్ గా ఓ డాన్స్ స్టైల్ కూడా ఈయన తయారుచేసారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఈయన్ని బాగానే లైక్ చేస్తారు.

కొత్తగా కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు ఎన్నో వున్నాయి. రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లోని మగధీర చిత్రానికి శివశంకర్ జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత అవార్డుని ఏకంగా నాలుగు సార్లు ఇచ్చి సత్కరించింది. ఇప్పటికీ కొరియోగ్రాఫర్ గా బిజీగా ఉన్న శివశంకర్ డాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మంచి నటుడు కూడా. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినప్పటికే తమిళంలో ఎక్కువ మూవీస్ లో నటించి నటనతో కూడా అలరించారు. గత ఏడాది నాలుగు చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా నటించారు.

ఇక శివశంకర్ కి అజయ్ శంకర్,విజయ్ శంకర్ అనే కుమారులున్నారు. బంధువు అయితే బాగా చూసుకుంటుందని, ఆయన భార్య తరపు బంధువుల్లో జ్యోతి అనే అమ్మాయిని కొడుక్కి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి మాట తీరు బాగోలేదని ముందే కొడుకు చెప్పినా, పెళ్లితర్వాత మారుతుందిలే అని శివశంకర్ నచ్చజెప్పారు. కొడుకు కూడా కొరియోగ్రాఫర్. ఇక పెళ్లి తర్వాత కూడా జ్యోతిలో మార్పు రాలేదు. సరి కదా, అహంకారంతో ఊగిపోవడం,భర్తతో అడ్డమైన చాకిరి చేయించుకోవడం చేసేదట.

ఈ విషయాన్నీ ఓ ఇంటర్యూలో శివశంకర్ మాస్టారు చెప్పారు. ఆమె రూమ్ కి భర్త భోజనం తీసుకెళ్లాలి. ఆమెకు ఆ భోజనం నచ్చకపోతే బయటనుంచి తేవాలి ఇలా ఏడిపించేది. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న కొడుక్కి ఆదాయం తక్కువ కావడంతో డబ్బు సంపాదించలేనివాడివి పెళ్లి ఎలా చేసుకున్నావని చులకనగా మాట్లేదని శివశంకర్ బాధతో చెప్పుకొచ్చారు. ఇక ఒకరోజు అయితే విడాకులు ఇమ్మని అడిగిందని, ఇవ్వకపోతే వాళ్ళ పాపని బాల్కనీ నుంచి కిందకి పడేస్తానని బెదిరించడమే కాదు పాపను వేళ్ళాడదీసిందని ఆయన కన్నీటి పర్యతం అయ్యారు.