Politics

పొలిటికల్ ఎంట్రీపై మెగా కోడలు స్పందన ఏమిటో…???

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య మెగా కోడలు ఉపాసన వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేస్తుందనే వార్తలకు ఉపాసన క్లారిటీ ఇచ్చారు. ఉపాసన తనకు వరుసకు బాబాయ్‌ అయ్యే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిపై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. విశ్వేశ్వర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున చేవెళ్ల నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసి ఎన్నికై ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు.

అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించాలంటే ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని, దానికి ఉపాసననే.. సరైన అభ్యర్ధి అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు ఓ ఇంగ్లీష్ పేపర్ రాసింది. దీంతో ఆ వార్తల పై స్పందిస్తూ..ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజంలేదని ఉపాసన తన సోషల్‌మీడియా ద్వారా తేల్చేసింది.