అమ్రీష్ పురి మనవడు కూడా హీరో అని తెలిస్తే బాబోయ్ అంటారు
విలన్ పాత్రలకు సరికొత్త భాష్యం చెప్పిన విలక్షణ నటుడు అమ్రీష్ పురి హిందీ,తెలుగు సినిమాల్లో తనదయిన ముద్ర వేసాడు. ఆయన లేకున్నా ఆయన చేసిన పాత్రలు ఆయన్ని సజీవంగానే ఉంచాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో మెగాస్టార్ చిరంజీవి, అందాల నటి శ్రీదేవి ఎంతగా అలరించారో చెప్పక్కర్లదు. అయితే అదేరీతిలో ఆడియన్స్ మెప్పించిన విలన్ పాత్రధారి అమ్రీష్ పురి ని ఎవరూ మరిచిపోలేరు. 1967నుంచి 2011వరకూ 400కి పైనే సినిమాల్లో నటించిన అమ్రీష్ పురి ఇద్దరు అన్నయ్యలు చమన్ పురి,మదన్ పురి లు కూడా నటులే.
అమ్రీష్ పురి స్టేజి నాటకాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 40ఏళ్ల వయస్సులో సినిమాల్లో చేరాలని భావించాడు. డిఫరెంట్ మేనరిజం తో హీరోలకు ధీటుగా నటించి చెరగని ముద్ర వేసాడు. నిజానికి అప్పటికే సినిమాల్లో నటులుగా రాణిస్తున్న చమన్ పురి,మదన్ పురి ల మాదిరిగా నటుడిగా పేరు తెచ్చుకోవాలన్న కోరికతో ముంబయ్ వచ్చిన అమ్రీష్ పురి తొలి స్క్రీన్ టెస్ట్ లో సెలెక్ట్ కాలేదు.
దీంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోయాడు. ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హిందీ , తెలుగు,మరాఠీ,పంజాబీ, కన్నడం, తమిళం,నటించిన అమ్రీష్ పురి బాలీవుడ్ లో తిరుగులేని నటుడయ్యారు. ఆఖరి పోరాటం,కొండవీటి దొంగ,జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆదిత్య 369,మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాల్లో అమ్రీష్ పురి నటనకు తెలుగు ప్రేక్షకులు జేజేలు పలికారు. అయితే ఓ స్టార్ హీరో చేసిన అవమానం కారణంగా తెలుగులో ఇక నటించనని ప్రకటించిన అమ్రీష్ పురి కి బాలీవుడ్ లో బిజీ అయ్యాడు.
అదే సమయంలో హాలీవుడ్ కి రావాల్సిందిగా స్పిల్ బర్గ్ నుంచి పిలుపు రావడంతో స్క్రీన్ టెస్ట్ మీరే ఇండియా రావాలని చెప్పేసాడు. దీంతో స్పిల్ బర్గ్ ఇక్కడికి వచ్చి స్క్రీన్ టెస్ట్ చేయాల్సి వచ్చింది. అలా హాలీవుడ్ కి చేరాడు. అయితే మొదట్లో స్క్రీన్ టెస్ట్ కి పనికిరావని బాలీవుడ్ లో చెబితే,ఆతర్వాత భారతీయ భాషల్లోనే కాదు హాలీవుడ్ కి అమ్రీష్ పురి వెళ్లి తన సత్తా చాటాడు.
ఇక 2005లో బ్లడ్ కాన్సర్ కారణంగా మరణించిన అమ్రీష్ పురి కి ఓ కొడుకు రాజీవ్ పురి,ఓ కూతురు నమ్రత ఉన్నారు. అమ్రీష్ పురి కి సినీ వారసత్వం లేకుండా పోయింది. అయితే కూతురు నమ్రత బ్యూటిఫుల్ గా ఉండేది. అయితే హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చే పరిస్థితి ఉన్నా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడింది. అయితే అమ్రీష్ పురి మనవడు వర్ధన్ పురి రొమాంటిక్ త్రిల్లర్ సినిమాలో కనిపించబోతున్నాడట.
ప్రముఖ నిర్మాత జయంతి లాల్ గాదా నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మూడు నెలల నుంచి షూటింగ్ జరుగుతోంది. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వర్ధన్ పురి ఇప్పుడు నటనకోసం గెటప్ మార్చాడు. సో ఆవిధంగా అమ్రీష్ పురి నటవారసుడిగా వర్ధన్ పురి రాణిస్తున్నాడు.