Movies

నానితో జోడీ కట్టిన ఈ ‘బొద్దు’గుమ్మ నిత్య మీనన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

తెలుగు ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఇప్పటి హీరోయిన్స్ లో నిత్య మీనన్ గురించి మొదటగా చెప్పుకోవాలి. తెలుగులో నానితో జోడీ కట్టి ,ఎంట్రీ ఇచ్చిన తొలిమూవీ హిట్ అవ్వడమే కాదు,అందులో ఆమె పాడిన పాట కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ ఇంగ్లీషు సినిమాలో నటించి అందరిని మెప్పించిన ఈమె ‘అలా మొదలైంది’మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో తన వాయిస్ కి తానే డబ్బింగ్ చెప్పుకోవడమే కాదు, ఆ సినిమాలో ఓ పాట కూడా పాడేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో వరుసపెట్టి ఛాన్స్ లు వచ్చేసాయి.

నిజానికి మళయాళీ బ్యూటీ అయిన నిత్యా తెలుగులో బాగా మాట్లాడగలదు. బెంగళూరులో సెటిల్ అయిన ఈ భామ జర్నలిజం లో డిగ్రీ చేసింది. సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని భావించిన ఈమె పూణేలోని ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంది. ఆసమయంలో డైరెక్టర్ నందిని రెడ్డితో ఏర్పడ్డ పరిచయం ఆమెను తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేలా చేసింది.

అలా మొదలైంది మూవీతో స్టార్ట్ చేసి, ఇష్క్, గుండెజారి గల్లంతయింది,ఓకే బంగారం,పొగ, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు,రుద్రమదేవి, ఇలా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తెలుగులోనే కాకుండా మళయాళీ, కన్నడ,తమిళ్ మూవీస్ లో కూడా తానేమిటో నిరూపించుకుంది.

చిన్న చిన్న డ్రెస్ లతో, స్కిన్ షోలతో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ గల సినీ ఇండస్ట్రీలో ఎక్స్ పోజింగ్ లేని గ్లామర్ తో కూడిన పాత్రలతో మరీ ముఖ్యంగా తన అభినయంతో ఇమేజ్ సొంతం చేసుకున్న నిత్యా తనదైన నటనతో అందరినీ ఫిదా చేస్తూ, దూసుకెళ్తోంది. అయితే ఈమె సడన్ గా లావెక్కిపోవడంతో గీత గోవిందం మూవీలో కేమియో పాత్రలో దర్శనమిచ్చింది.

ఆ సినిమాలో ఆమెను ఇంతలావు ఎలా అయిపోయిందన్న జనం ఇప్పుడు కనుక ఆమెను చూస్తే మళ్ళీ ఇలా ఎలా అయిందబ్బా అంటూ నోరెళ్లబెడతారు. ఎందుకంటే తొలిసినిమాలో కూడా లేని నాజూకు తనంతో తయారైందంటే, దానికి కారణం ఆమె నటించబోయే తదుపరి చిత్రంలో పాత్రకోసం అలా పరకాయప్రవేశం చేయడమే అని అంటోంది. మరి తదుపరి చిత్రం లో నిత్యా ఎలా ఉంటుందోనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.