శరత్ బాబు గురించి మనకు తెలీని నిజాలు… ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?
సినిమా రంగంలో హీరో హీరోయిన్స్ తో పాటు కేరక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉంటారు. ఒకప్పుడు హీరోలుగా వచ్చి,ఆతర్వాత కేరక్టర్ ఆర్టిస్టులుగా కంటిన్యూ అయిన వాళ్ళూ ఉంటారు. అలాంటి వాళ్లలో అందమైన నటుడు శరత్ బాబు ఒకరు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ఇతడి అసలు పేరు సత్యనారాయణ దీక్షత్. చిన్నప్పుడు సత్యంబాబు,దీక్షిత్ బాబు అని పిలిచేవారు. రామరాజ్యం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి శరత్ బాబు అయ్యాడు. హీరోగానే కాదు ఆతర్వాత కొన్ని చిత్రాల్లో విలన్ గా కూడా వేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అన్నగా,తండ్రిగా, పోలీసాఫీసర్ గా లాయర్ గా ఇలా ఎన్నో పాత్రల్లో శరత్ బాబు ఒదిగిపోయాడు. దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించిన వ్యక్తిగత జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. ఇక తనకంటే వయస్సులో చాలా పెద్దదైన సీనియర్ నటి రమా ప్రభతో సహజీవనం కీలక ఘట్టంగా చెప్పాలి. ఇది చాలా సమస్యలకు దారితీసింది.
పదేళ్ళపాటు సంబంధం బాగానే కొనసాగినప్పటికీ విబేధాలు రావడంతో తెగతెంపులయ్యింది. ఆతర్వాత 1999లో తమిళనటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడాడు. దురదృష్టం వెంటాడితే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. అందుకే రెండోపెళ్లి కూడా శరత్ బాబుకి కల్సి రాలేదు. అందుకే 2011లోనే విడాకులు తీసుకున్నారు.
కాపురంలో కలతలు ఇందుకు కారణం. ఇక అందాల తార నమితతో ముడిపెట్టి చాలా కథనాలు ఇటీవల వచ్చాయి. అయితే ఇంతలోనే తన బాయ్ ఫ్రెండ్ వీర్ ని పెళ్ళాడి నమిత సెటిల్ అవ్వడంతో గాసిప్స్ కి బ్రేక్ పడింది. ఇటీవల ఓ ఇంటర్యూలో శరత్ బాబు తన వ్యక్తిగత జీవితంలో విషయాలను షేర్ చేసుకుంటూ రమా ప్రభను పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రమే చేశానని, పెళ్లి జరిగింది మాత్రం నంబియార్ కూతురితోనేనని స్పష్టంచేశాడు.