Devotional

శ్రీ వికారి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూడండి

శ్రీ వికారి నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం – 08 వ్యయం – 08 రాజపూజ్యం – 06 అవమానం – 06.
శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన ఆరోగ్య విషయముల మినహా నవంబర్ 3 వరకూ అన్ని విషయాలందు మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు లభించును. భార్యాభర్తల మధ్య ప్రేమపూరిత వాతావరణం నెలకొంటుంది. 04-నవంబర్ – 2019 నుండి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు గురు గ్రహానికి శాంతి జపములు జరిపించుకోనూట మంచిది.నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగంలో ప్రమోషన్స్,ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టటానికి అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల మద్దతు ముఖ్యంగా జీవిత బాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. విధ్యార్ధులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ దారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

వృషభ రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహ ప్రభావం వలన 23-జనవరి-2020 వరకూ ఆర్ధిక పరమైన సమస్యలు ఉంటాయి . 24-జనవరి-2020 నుండి ఎక్కువ ధనాదాయం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప అనుకూలమైన కాలం. శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు – కేతువులు మంచి ఫలితాలు ఇవ్వరు. రాహువు వలన అదుపు తప్పిన వ్యయం, ఆయు: గండములు ఏర్పడును. కేతువు వలన వడ్డీ వ్యాపారం చేయువారికి నష్టములు, తగాదాలు ఏర్పడును.