Devotional

శ్రీ వికారి నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?

శ్రీ వికారి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం – 08 వ్యయం – 08 రాజపూజ్యం – 07 అవమానం – 01.తులా రాశివారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వదు. ఫైనాన్సు వ్యాపారాలకు మాత్రం అతి చక్కటి ఫలితాలను కలుగచేసి వ్యాపార వృద్ధిని ఏర్పరచును. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సామాన్య ఫలితములను ఏర్పరచును. జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

సంవత్సర ప్రారంభం నుండి సంవత్సర అంతానికి క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారును. నూతన వ్యాపార ప్రయత్నాలు పలిస్తాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడును. స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యలు కొనసాగును. విద్యార్ధులకు ఆశించిన ఉన్నతి లభించును. తులా రాశివారికి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. రాహు – కేతువులు ఇరువురూ అనుకూలంగా ఉండును. చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చును.