శ్రీ వికారి నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?
శ్రీ వికారి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 06 అవమానం – 01. ధనస్సు రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 03-నవంబెర్ – 2019 వరకూ వ్యవహరపు చిక్కులు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడి పనులు ముందుకు సాగక కాస్త అసహనంగా ఉంటుంది. 04-నవంబెర్-2019 నుండి గురువు ఆర్ధికంగా అఖండమైన యోగాన్ని ఏర్పరచును. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండాలి.
ధనస్సు రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం 6-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శ్రీ వికారి నామ సంవత్సరం ధనుర్ రాశి వారికి ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. వైవాహిక జీవనంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు. ధనస్సు రాశివారు శని గ్రహ ప్రభావం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శని ఈ రాశివారికి ఆర్ధికంగా ఎటువంటి ఇబ్బందులు కలిగించడు. రాహు – కేతువులు ఇరువురూ కలసి రారు. వైవాహిక జీవనంలో తగాదాలను తీవ్రతరం చేస్తారు. అనవసర పట్టుదలకు పోవుట వలన వ్యక్తిగత నష్టాలు జరుగుతాయి.