శ్రీ వికారి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?
శ్రీ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం – 05 వ్యయం – 02 రాజపూజ్యం – 05 అవమానం – 04.కుంభ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలుగచేయును. ముఖ్యంగా విద్యార్ధులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. న్యాయబద్దంగా ధనాన్ని సంపాదిస్తారు. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆర్ధికంగా కలసి వచ్చును. 23-జనవరి-2020 వరకూ జీవితం సంతోషంగా ఉంటుంది.
ఆశించిన దాని కన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. ది.24-జనవరి-2020 నుండి కుంభరాశి వారికి ఎడున్నార సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభమగును. అప్పటి వరకూ అనుకూలమైన ఫలితాలనే ఏర్పరచును. ఏలినాటి శని దశ ప్రారంభం అయ్యాక అంతగా కలసిరాదు. వృధా వ్యయమును, మానసిక అశాంతిని , ఆరోగ్య భంగములను ఏర్పరచును. రాహు – కేతువులు ఇరువురూ ఆర్ధికంగా బలంగా ఉండేలా చేస్తారు.