శ్రీ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?
శ్రీ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం – 05 వ్యయం – 02 రాజపూజ్యం – 02 అవమానం – 04.మకర రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం గురు గ్రహం వలన 03-నవంబెర్-2019 వరకూ వృత్తి జీవనం చేసేవారికి అధిక వృద్ధిని కలుగచేయును. న్యాయమైన మార్గంలో ధనార్జనను ఏర్పరచును. 04-నవంబెర్-2019 నుండి అంతగా కలిసి రాదు. కుటుంబం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మకర రాశి వారికి కూడా శ్రీ వికారి నామ సంవత్సరం అంతా ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది.
శని వలన ఈ సంవత్సరం అనవసర ఆడంబరాలకు అధికంగా ధనవ్యయం ఏర్పరచును. ఆర్ధికంగా ఆశించిన ఫలితం ఉండదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే చాలా కష్టం. 24- జనవరి-2020 నుండి కొంత ఆర్ధికంగా పరిస్థితి మెరుగు పడును. జీవితం కాస్త ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. మొత్తం మీద శని వలన మకరరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండవు. శనికి శాంతి జపములు అవసరం.