శ్రీ వికారి నామ సంవత్సరంలో మీనా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా?
శ్రీ వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం – 02 వ్యయం – 08 రాజపూజ్యం – 01 అవమానం – 07.శ్రీ వికారి నామ సంవత్సరంలో శని కూడా సంవత్సరం అంతా విశేష ధనలాభములను , నూతన ఆదాయ మార్గములను ప్రసాదించును. ఆర్ధికంగా లోభత్వం ప్రదర్శించుట వలన కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పరచును. ముఖ్యంగా 24-జనవరి-2020 నుండి ఆర్ధికాభివృద్ధి చాలా వేగంగా ఉండును.ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా కల్సి వస్తుంది.
ఆర్ధికంగా, వ్యక్తిగత జీవన పరంగా , వృత్తి పరంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. గురు గ్రహం అనుగ్రహం కారణంగా మిక్కిలి సంతోషంగా ఉంటారు. భూ సంబంధ లాభాలను, వారసత్వ లేదా జీవిత భాగస్వామి సంబంధిత భాగ్యమును, స్వార్జిత ధన సంపదలను ఏర్పరచును. అందరూ మెచ్చే విధంగా సంస్కారాన్ని ప్రసాదించును. చెడు వ్యసనాలనుండి బయటపడు పరిస్థితులను ఏర్పరచును. నిరుద్యోగులకు అతి చక్కటి ఉద్యోగ జీవనాన్ని ప్రసాదించును. ప్రమోషన్లు, సత్కారములను ఏర్పరచును. రాహు – కేతువుల వలన విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడతాయి.