Politics

తెలంగాణా సీఎం మరో సంచలన నిర్ణయం… పరిపాలనలో కొత్త ట్రెండ్

తెలంగాణా రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించి ముఖ్యమంత్రి గా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజా హృదయాలను గెలుచుకున్నారు. ఘన విజయం సాధించాక వరుసగా రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఎన్నో సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. వేగం మరింత పెంచారు. రాష్ట్ర పాలనలో తనదైన ముద్ర చూపిస్తున్నారు.

ఇప్పటికే పలు శాఖలను తన వద్దే ఉంచుకుని నిత్యం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఇక తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలన అంశాలు, చట్టాలు ఆంగ్లంలో ఉన్నాయి. ఇవి ఎక్కువమందికి అర్ధం కావడం లేదు. అందుకే వాటిని తెలుగులో ఉంచేలా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఈవిధంగా కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ లేపుతున్నారు.

నిజానికి గతంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన సందర్బంగా ప్రభుత్వ పాలనా విషయాలు, సచివాలయ నిబంధనలు,చట్టాలు అన్నీ తెలుగులో ఉండేలా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆదిశగా నిర్ణయం తీసుకున్నారు. దీనివలన ఎమ్మెల్యేలకు,ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్ధం అవుతాయని భావిస్తున్నారు. కవి ,గాయకుడు దేశపతి శ్రీనివాస్,గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ లకు అప్పగించారు. దీంతో సచివాలయ నిబంధనలను, ప్రభుత్వ పరిపాలన విషయాలను తెలుగులోకి మార్చే ప్రక్రియ కూడా పూర్తిచేసినట్లు తెలుస్తోంది.