Business

హైదరాబాద్ మెట్రో స్టేష్టన్స్ లో ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా?

హైదరాబాద్ నగరానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఓ వరం. దాదాపు 72కిలోమీటర్ల పరిధిగా గల మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో ప్రతి కిలోమీటర్ కి ఓ స్టేషన్ ఏర్పాటుచేశారు. నిత్యం 15లక్షలమందిని గమ్య స్థానాలకు చేర్చేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసారు. జనం కూడా వీటిని బాగా ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ రద్దీగా ఉంటూ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. భవిష్యత్తులో వీటిని మరింత పెంచడానికి కూడా ప్రణాళికలు వేస్తున్నారు.

హైదరాబాదు లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ఎక్కడికక్కడ సిగ్నల్ లైట్స్ పడడంతో ప్రయాణం ఆలస్యం అయిపోతున్న నేపథ్యంలో ట్రాఫిక్ లో చిక్కుకుని కష్ఠాలు పడేకన్నా రైలు ఎక్కడం మంచిదన్న భావనకు మెజార్టీ ప్రజలు రావడంతో మెట్రో రైలు వ్యవస్థకు గిరాకీ ఏర్పడింది. ప్రతి స్టేష్టన్ కూడా సంస్కృతిని ప్రతింబించేలా ఉండడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటుచేశారు. జనం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు మెట్రో రైల్వే స్టేషన్ లో ఫుడ్ కోర్ట్స్ కూడా మొదలైంది.

అయ్యంగారి భోజన శాల ఇది. మొట్ట మొదటగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో ప్రారంభించిన ఈ కేంటీన్ లో కేవలం 50రూపాయలు చెల్లిస్తే చాలు ఎంతైనా తినవచ్చు. టోకెన్ తీసుకుని దోశలు, ఇడ్లీలు,పొంగల్ ఎంతకావాలంటే అంత లాగించేయొచ్చు. ఇలా టిఫిన్ సెక్షన్ సరే, భోజనం కూడా అంతేనండి. 100రూపాయల టోకెన్ తీసుకుంటే కమ్మని భోజనం కడుపునిండా పెడతారు. ఓపెనింగ్ రోజున వేల సంఖ్యలో జనం టిఫిన్స్ , భోజనం చేసారు.