Movies

ఎన్టీఆర్ గురించి కాంతారావు షాకింగ్ కామెంట్స్

అప్పటికే ఎన్టీఆర్ సినిమాల మీద సినిమాలు చేస్తుంటే, అప్పుడు సినీ రంగంలో కాంతారావు అడుగులు వేస్తున్నాడు. ఎన్టీఆర్ హీరోగా శభాష్ రాముడు మూవీలో కాంతారావు చిన్నపాత్రలో కనిపిస్తాడు. సీఎస్ రావు,డూండి కల్సి నిర్మించిన ఈ సినిమాలో కాంతారావు నటిస్తుండగా ఆయన నాయనమ్మ కు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆయన వలవల ఏడవడంతో అందరూ ఖంగు తిన్నారు. షూటింగ్ ఆపేసి ఇంటికి పొతే అక్కడ జరగరానిది జరిగితే కార్యక్రమాలకు డబ్బులు ఎలా వస్తాయి అని దిగాలుగా ఉండిపోయాడు.

అప్పటికే నిర్మాత నుంచి అవసరానికి మించి అడగడంతో మళ్ళీ ఏం అడుగుతామని ఆత్మాభిమానం అడ్డొచ్చి కాంతారావు దిగాలుగా కూర్చున్నాడు. అయినా మనసు చంపుకుని అడిగితె ఇవ్వడానికి కుదరదని ప్రొడ్యూసర్ సీఎస్ రావు మొహం మీదే చెప్పేసాడు. ‘కాంతారావు సినిమాల్లోకి వెళ్ళాడు. డబ్బులు బానే సంపాదిస్తున్నాడని ఊరివాళ్ళు అంతా అనుకుంటారు. మరి ఇప్పుడు డబ్బుల్లేకుండా వెళ్తే పరువు పోదా అని దిగాలుగా కూర్చున్నాడు.

ఇదంతా ఎన్టీఆర్ గ్రీన్ రూమ్ లో కూర్చుని గమనిస్తూ ఇంటికి వెళ్లేముందు తనకారులో ఇంటికి తీసుకెళ్లి 5వేల రూపాయలు చేతిలో పెట్టి ఊరెళ్ళి రండి. నిర్మాతకు నేను చెబుతాను అని భరోసా ఇచ్చాడు. అయితే డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండే ఎన్టీఆర్ ఈ సొమ్ముని రెండు మూడు నెలల్లో ఇచ్చేయాలని షరతు పెట్టారట.

షరతు పెట్టినా ఆరోజుల్లో అంతపెద్ద మొత్తం ఇవ్వడం అంటే అది ఎన్టీఆర్ ఉదారతకు నిదర్శనం అని కాంతారావు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బుతో ఊరెళ్ళి కార్యక్రమాలు చక్కబెట్టి వచ్చిన కాంతారావు వెంటనే ఓ సినిమా చేసి ఎన్టీఆర్ కి డబ్బులు తిరిగి ఇచ్చేసారట. ఎన్టీఆర్ గొప్పతనాన్ని అనగనగా ఓ రాజకుమారుడు పేరిట రాసుకున్న ఆత్మకథలో కాంతారావు వివరించారు.