రమాప్రభ అలా అయిపోడానికి కారణం ఎవరో తెలిస్తే షాకవుతారు
సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం కొత్తకాదు. అయితే ఇలా పెళ్లాడివాళ్లలో ఎక్కువ కాలం కల్సి వుండేవాళ్ళు కనిపిస్తారు. అదే సమయంలో మనస్పర్ధలతో విడిపోవడం,కోర్టులో విడాకులు పొందడం లాంటి కేసులు చూస్తుంటాం. అయితే ఇలా విడిపోవడం వలన నష్టపోయిన రమాప్రభ పరిస్థితి చాలా దయనీయం. ఇండస్ట్రీలో రమా ప్రభ,శరత్ బాబు జంట పుష్కరకాలం పైగా హాయిగా సాగింది. కానీ ఆతర్వాత వారి మధ్య వచ్చిన గొడవలు విడాకులకు దారితీసి కోర్టు మెట్లు ఎక్కింది. శరత్ బాబు కన్నా ముందే రమాప్రభ సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇద్దరిమధ్యా యాజ్ గ్యాప్ కూడా ఎక్కువే. పైగా రమాప్రభ కన్నా శరత్ బాబు 8ఏళ్ళు చిన్నవాడు.
ఇద్దరు సినిమాల్లో నటిస్తూ ఎవరికి వారు మంచి పేరు తెచ్చుకుని,ప్రేమలోపడి పెళ్లిచేసుకున్నారు. అయితే దాదాపు 14ఏళ్లపాటు ఇద్దరి కాపురం సవ్యంగా సాగినా ఆతర్వాత నుంచి తేడా రావడంతో తరచూ గొడవలు పడేవారు. నిజానికి రమాప్రభ కల్లా కపటం తెలియని భోళా మనిషి. మనసులో ఉన్నది వెంటనే బయటకు చెప్పేస్తుంది. ఇది శరత్ బాబుకి నచ్చేది కాదు.
ఇక రమాప్రభ కు గర్భ సంచి ప్రోబ్లం వలన పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవకు వేదిక అయింది. రమాప్రభ కు సోదరుడైన రెడ్డి శేఖర్ ని బాగా నమ్మేది. అతడే కారు డ్రైవర్ గా ఉంటూ ఆమెను షూటింగ్స్ కి తీసుకెళ్ళేవాడు.అలాగే శరత్ బాబు ని కూడా రెడ్డి శేఖర్ కారులో దించేవాడు.
దీంతో శరత్ బాబు,శేఖర్ ల మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. చివరకు శేఖర్ నమ్మడం వలన రమాప్రభకు శాపం అయింది. శరత్ బాబుతో ఏర్పడుతున్న గొడవతో రమాప్రభ విడాకులకు కోర్టుకి వెళ్ళింది. ఆ సమయంలో సొంత తమ్ముడే ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో ఆస్తుల విషయంలో శరత్ బాబుకి కల్సి వచ్చింది.
రమాప్రభ కు చుక్కెదురైంది. భర్తను, ఆస్తులను కెరీర్ ని కూడా వదులుకుని ఆమె రెండేళ్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ తేరుకుని బతకడానికి సరిపడా సంపాదించుకుంటూ,ఆధ్యాత్మిక చింతనతో గడుపుతోంది. మరి శరత్ బాబు మళ్ళీ పెళ్ళిచేసుకుని హ్యాపీగా విలాసవంతమైన జీవనం గడుపుతున్నాడు.