Valentine's day

వేలంటైన్స్ డే రోజు స్పెషల్ గా కన్పించాలంటే …. చిట్కాలు

వేలంటైన్స్ డే కి ముందు కొన్ని చిట్కాలను పాటిస్తే ముఖం గ్లోగా మారుతుంది. రోజుకి రెండు లీటర్ల నీటిని త్రాగటం ప్రారంభించాలి. మంచి నీటిని త్రాగటం వలన శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పోతాయి. దాంతో మొటిమల సమస్య తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

టర్మరిక్ పౌడర్ ని శాండల్వుడ్ పౌడర్, పాలు అలాగే రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి రాస్తే ముఖానికి మంచి గ్లో వస్తుంది.

హానీ మాస్క్ వేసుకుంటే చర్మంలో తగినంత తేమ ఉండి ముఖం కాంతివంతంగా కనపడుతుంది.

నైట్ క్రీమ్ తప్పనిసరిగా వాడాలి. రాత్రి సమయంలో క్రీమ్ రాయటం వలన చర్మ కణాల మరమత్తు జరుగుతుంది.

ఫిషియల్ ఆయిల్స్ తో ముఖానికి మసాజ్ చేస్తే మంచి గ్లో వస్తుంది.