ఎన్టీఆర్ కూతురిని చేసుకోడానికి చంద్రబాబు ఇంట్రెస్ట్ చూపలేదా… కారణం ఏమిటో?
రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైన ఎన్టీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. వాటిని విజయవంతంగా అమలుచేశారు. అయితే ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టడానికి ముందే ఆయనకు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లుడయ్యారు. అయితే అదికూడా విచిత్రంగా జరిగింది. మొదట్లో ఈ పెళ్ళికి చంద్రబాబు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. దీనికి కారణం ఏమిటో చూద్దాం. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో గల కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. చిన్నవయసులోనే 1978లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచారు.
అప్పటి కాంగ్రెస్ రాజకీయాల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సీఎంగా దిగిపోయాక, టంగుటూరి అంజయ్య సీఎం అయ్యారు. అంజయ్య కొలువులో చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు.ఇక అదే సమయంలో ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అప్పుడే ఆయన దృష్టి చంద్రబాబుపై పడింది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నందున ఠక్కున ఆయనపై దృష్టిపడింది. అదెలా అంటే ఒకసారి రామకృష్ణ స్టూడియోను చూడ్డానికి చంద్రబాబుని ఎన్టీఆర్ కుమారులు పిలిచారు.
ఆసమయంలో ఎన్టీఆర్ కొడుకులు,కోడళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ కుటుంబం అంతా చంద్రబాబుని నిశితంగా పరిశీలించారు. ఇదంతా చంద్రబాబు కి సహాధ్యాయి, అంతరంగికుడు అయిన ప్రయివేట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ పసిగట్టారు స్టూడియో నుంచి ఇంటికి కారులో వస్తుండగా చంద్రబాబుకు ఈ విషయాన్ని లక్ష్మీనారాయణ చెప్పేసారు. అది ఎక్కడ కుదురుతుందని చంద్రబాబు సీరియస్ గా తీసుకోలేదట.
ఆతర్వాత రెండుమూడు సార్లు రాకపోకలు జరగడం,ఓసారి స్వయంగా ఎన్టీఆర్ తన ఇంటికి చంద్రబాబుని ఆహ్వానించడం,అది పెళ్లి ప్రతిపాదనకు దారితీయడం జరిగాయి. మద్రాసులో పెళ్లి మాటలకు అప్పటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం నాయుడు,లక్ష్మీనారాయణ లను వెంటబెట్టుకుని చంద్రబాబు వెళ్లారు.’చంద్రబాబుకి ఆస్తి లేకున్నా పేరు పలుకుబడి ఉన్నాయి. పైగా నాలాగే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు’అని ఎన్టీఆర్ భావించారు. అయితే ఆస్తి లేదు,పైగా రాజకీయ నాయకుడిని మరి తనతో సర్దుకుపోతుందా అని చంద్రబాబు తటపటాయించినా ఆతర్వాత ఒప్పుకున్నారు.
దీంతో ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావు ని నారావారిపల్లె పల్లి పెళ్లి నిశ్చయం చేసారు. ఇక పెళ్లి మద్రాసులో వైభవంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. ఆతర్వాత హైదరాబాద్ లో చంద్రబాబు బంజారా హిల్స్ లో ఇచ్చిన విందులో సీఎం అంజయ్య , కేబినెట్ మంత్రులు అందరూ హాజరయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి చంద్రబాబుతో సంబంధం కారణమైందో లేక రాజకీయాల్లోకి రావాలన్న బీజం అప్పటికే ఎన్టీఆర్ మనసులో నాటుకుందో ఏమోగానీ ఈ సంబంధం తర్వాత రాష్ట్ర రాజకీయాలతో ఎన్టీఆర్ కి ప్రత్యేక సంబంధాలు ఏర్పడ్డాయి.