టాలీవుడు మన్మధుని ఆస్తులు – ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో తెలుసా?
అక్కినేని నటవారసుడిగా అడుగుపెట్టి తన సత్తా చాటి నిత్య యవ్వనంతో మన్మధుడిని తలపిస్తున్న నాగార్జున విభిన్న పాత్రలతో కుర్ర హీరోలకు ధీటుగా దూసుకుపోతున్నాడు. విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ప్రేమ కథా చిత్రాలతో పాటు యాక్షన్ మూవీస్, కుటుంబ కథా చిత్రాలు కూడా చేసాడు. వీలు దొరికితే కమర్షియల్ విలువలు లేకున్నా విభిన్న చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఇక నాగ్ నటించిన శివ మూవీ వీరోచిత్తానికి మచ్చుతునక. సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చాలానే ఉన్నాయని కొందరికే తెలుసు. ఇక యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. మొత్తం మీద ఏటా 30కోట్ల ఆదాయం గడిస్తున్నాడని అంటున్నారు.
ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్లుగా గల ఈ నవ మన్మధుడి ని ముద్దుగా కింగ్ అని ఫాన్స్ పిలుచుకుంటారు. సినిమాల్లో నటించడమే కాదు వివిధ రంగాల్లో అడుగుపెట్టి వ్యాపార పరంగా కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తాడు. ఇంట్లో బాధ్యతలను ఆయన సతీమణి అమల చూసుకుంటున్నారు. ఇక పెద్ద కొడుకు నాగచైతన్య కేరీర్ లో బానే నిలబడగా, అఖిల్ ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని పదిలపరుచుకునే యత్నం చేస్తున్నాడు.
ఎంత ఎదిగినా సరే నాగ్ సింపుల్ గా ఉంటూ ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తాడు. కుటుంబానికి కూడా తగిన సమయం కేటాయిస్తూ ఫామిలీ తో ఎంజాయ్ చేస్తాడు. ఇక అక్కినేని వారసత్వంగా వచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలతో చూసుకోవడంతో పాటు తాను స్థాపించిన కనస్ట్రక్షన్ కంపెనీ ద్వారా లాభదాయకంగా ఉన్నాడట. మీడియా రంగంలో కూడా మా టివి నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించి వాటా దారునిగా ఉన్నాడు. దీనివలన భారీగానే ఆదాయం లభించిందని టాక్.
స్పోర్ట్స్ టీమ్ లలో కూడా నాగ్ కి వాటా వుంది. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ తో కల్సి ఓ టీమ్ కి పార్ట్ నర్ గా ఉన్నాడు. ఫిలిం నగర్ లో 45కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవంతి ఉంది. బిఎం డబ్ల్యు , ఆడి వంటి అత్యంత ఖరీదైన కార్లున్నాయి. వీటివిలువ పదికోట్లు పలుకుతుందని చెప్పవచ్చు. హుందాగా గౌరవంగా మెలుగుతూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు.